ఏడుపాయల కొత్త రథానికి  కవిత 5 లక్షల విరాళం

ఏడుపాయల కొత్త రథానికి  కవిత 5 లక్షల విరాళం

హైదరాబాద్‌‌, వెలుగు: మెదక్‌‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ ఆలయంలో కొత్త రథం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.5 లక్షల విరాళం అందజేశారు. శుక్రవారం చెక్కును మెదక్‌‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌‌ రెడ్డికి అందజేశారు. ఎమ్మెల్సీగా తనకు వచ్చే జీతం నుంచి ఈ మొత్తం అందజేస్తున్నట్టు ఆమె తెలిపారు. గతంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌‌‌‌రెడ్డితో కలిసి వనదుర్గ మాతను దర్శించుకున్నానని, అమ్మ వారిపై భక్తితో తన వంతు సాయంగా ఈ మొత్తాన్ని అందజేసినట్టు కవిత తెలిపారు.