కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

ఢిల్లీ మద్యం పాలసీ - సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్  పై వాదనలు ముగిశాయి. మే 2 కు తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి కావేరి బవేజ.  కాసేపట్లో ఈడీ లిక్కర్ కేసులో వేసిన బెయిల్ పిటిషన్ పైనా విచారణ జరగనుంది.  మహిళగా కవిత పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్  కు అర్హురాలని ఆమె తరపు లాయర్లు వాదనలు వినిపించారు. అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదని చెప్పారు. కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని వివరించారు కవిత తరపు లాయర్. 

ఈడీ కస్టడీలో ఉండగా, సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసిందని అడిగారు. అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేనప్పటికీ అరెస్టు చేశారని కోర్టుకు వివరించారు ఆమె తరపు లాయర్. కవిత బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపైనర్ గా ఉన్నారని చెప్పారు. చిదంబరం కేసులో తీర్పు కవిత విషయంలో సరిపోతుందన్నారు. ఏడేళ్ల లోపల శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదన్నారు. 

అయితే లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టులో వాదించింది సీబీఐ. కవిత దర్యాప్తును ప్రభావితం చేయగలుగుతారని చెప్పారు. లిక్కర్ కేసులో ఆమె కీలక వ్యక్తిగా ఉన్నారని వివరించారు.