హైదరాబాద్కు బయలుదేరిన కవిత

హైదరాబాద్కు బయలుదేరిన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ అనంతరం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. మంత్రి కేటీఆర్, హరీష్ రావులతో పాటు బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వస్తున్నారు. మరో రెండు గంటల్లో హైదరాబాద్ కు చేరుకోనున్నారు. కాగా మార్చి 16న మరోసారి ఈడీ విచారణకు కవిత హాజరుకానున్నారు. లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అధికారులు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఆమె ఆఫీస్ నుంచి నేరుగా తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లారు.

ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసులోకి వెళ్లిన కవిత.. రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రశ్నించారు అధికారులు. సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయల ముడుపులను ఆప్ పార్టీకి ఇచ్చినట్లు సిసోడియా, పిళ్లయ్, బుచ్చిబాబు, మాగుంట రాఘవరెడ్డిలు ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించారు. కేసులో విచారణ ఇంకా ముగియలేదని.. మార్చి 16వ తేదీన కవితను మళ్లీ విచారించనున్నట్లు తెలిపారు ఈడీ అధికారులు.