జోగులాంబ ఆలయా సేవలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఆర్ బీఐ సీజీఎం

జోగులాంబ ఆలయా సేవలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఆర్ బీఐ సీజీఎం

అలంపూర్, వెలుగు: జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను గురువారం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. 

ఆర్ బీఐ ఏపీ, తెలంగాణ సీజీఎం, లోకాయుక్త డాక్టర్ సింగాల సుబ్బయ్య బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. అధికారులు పృథ్వీ ఫాల్గుణి, కిరణ్ జార్జ్ తదితరులున్నారు.