పార్లమెంట్ ప్రొసీడింగ్స్​ను లైవ్​లోచూసేందుకు యాప్

పార్లమెంట్ ప్రొసీడింగ్స్​ను లైవ్​లోచూసేందుకు యాప్

న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రొసీడింగ్స్​ను లైవ్​లో చూసేందుకు ప్రభుత్వం మొబైల్ అప్లికేషన్​ను తయారు చేయించింది. సెషన్స్ లైవ్ టెలీకాస్ట్, వివిధ పార్లమెంటరీ పత్రాలు, రాతపూర్వక ప్రశ్నలు, -సమాధానాలు, వివిధ కమిటీల రిపోర్ట్స్ అన్నీ ఉండే యాప్​ను మంగళవారం లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా ప్రారంభించారు. అనంతరం క్వశ్చన్​అవర్లో యాప్ ఫీచర్లు, దాని ఉపయోగాలను హౌస్​లో ఎంపీలకు వివరించారు. లోక్​సభ, రాజ్యసభ ఎంపీలంతా యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలని.. ప్రజలు కూడా అవగాహన కల్పించాలని స్పీకర్ ఎంపీలకు సూచించారు. ఈ యాప్​లో ఆయా నియోజకవర్గాల ప్రజలు తమ ఎంపీల పనితీరును చూసే అవకాశం ఉంటుందని చెప్పారు.