త్వరలో మొబైల్ టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌లు పెరిగే అవకాశం

త్వరలో మొబైల్ టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌లు పెరిగే అవకాశం

హర్యానా, ఒడిశాలలో బేస్ టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌ను రూ.99 నుంచి రూ.155 కి పెంచిన ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ సక్సెస్ అయితే మిగిలిన సర్కిళ్లలో కూడా అమల్లోకి వొడాఫోన్ ఐడియా, జియోలు కూడా అదే బాటలో 

న్యూఢిల్లీ: త్వరలో మొబైల్ టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ పైలెట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ కింద హర్యానా, ఒడిశా టెలికం సర్కిళ్లలో తమ ప్రీపెయిడ్‌ బేస్‌‌‌‌ (తక్కువ రేటు ప్లాన్‌) టారిఫ్‌‌‌‌ను రూ.99 నుంచి రూ.155 కి పెంచింది.  ఇది సక్సెస్ అయితే అంటే కస్టమర్ల నుంచి ఈ ప్లాన్‌కు మంచి స్పందన వస్తే   మిగిలిన సర్కిళ్లలో కూడా బేస్‌ టారిఫ్‌‌‌‌లు పెరగొచ్చు. ప్రస్తుతం 10 కోట్ల మంది ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌, వొడాఫోన్ ఐడియా (వీ) కస్టమర్లు రూ.99 ప్లాన్‌‌‌‌ను వాడుతున్నారని అంచనా. దీన్ని రూ.155 చేయడంతో పాటు ఈ ప్లాన్ కింద అన్‌‌‌‌లిమిటెడ్ కాల్స్‌‌‌‌ సౌకర్యాన్ని  ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ ఆఫర్ చేస్తోంది. ఈ సక్సెస్ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌కు మాత్రమే కాదు మొత్తం టెలికం ఇండస్ట్రీ మొత్తానికి లాభం చేకూరుస్తుంది. టెలికం కంపెనీలు తమ ప్రీపెయిడ్‌‌‌‌ టారిఫ్‌‌‌‌లలో లోవర్ బేస్‌‌‌‌ను రూ.155 కి, అప్పర్ బేస్‌‌‌‌ను మరో 10–15 శాతం పెంచాలని చూస్తున్నాయి. కిందటేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో చివరిసారిగా టారిఫ్‌‌‌‌లు పెరిగాయి. ఎంట్రీ లెవెల్ యూజర్లను  ఎక్కువ వాల్యూ ఉన్న ప్లాన్లను కొనేటట్టు చేస్తే టారిఫ్‌‌‌‌ల రేట్లు  వెంటనే 57 శాతం పెరుగుతాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఇలా చేయడం వలన  ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ రెవెన్యూ 2.5–3 % పెరుగుతుందని చెప్పారు. మరోవైపు సేమ్‌ ప్లాన్‌‌‌‌కు ఎక్కువ చెల్లించమని కస్టమర్లను అడిగితే టెలికం కంపెనీల యావరేజ్ పెర్ రెవెన్యూ (ఆర్పూ) కూడా పెరుగుతుందని వివరించారు. ‘బేస్‌‌‌‌లైన్‌‌‌‌ టారిఫ్‌‌‌‌లు, హయ్యర్ ఎండ్‌‌‌‌లోని టారిఫ్‌‌‌‌లు పెరుగుతాయని ముందుగా అంచనావేసిందే. ఇదే జరిగితే టెల్కోల ఇబిటా భారీగా పెరుగుతుంది. ఫలితంగా మొత్తం టెలికం ఇండస్ట్రీ బాగుపడుతుంది’ అని ఈవై గ్లోబల్‌‌‌‌ ఈఎంటీ ఎమెర్జింగ్ మార్కెట్ లీడర్ ప్రశాంత్ సింఘాల్‌‌‌‌ అన్నారు. ఆర్పూ 5 % పెరిగినా  2023–24 లో టెలికం కంపెనీల ఇబిటా 4 % పెరుగుతుందని  సిటీ రీసెర్చ్ ఎనలిస్ట్ వివరించారు. టారిఫ్‌‌‌‌ల పెంపు సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా అమలు చేయగలిగితే 5జీ ఖర్చులు పెంచడానికి  కంపెనీలకు వీలుంటుందని అన్నారు.  ఫండ్స్‌‌‌‌ను సేకరించడంలో ఇబ్బంది పడుతున్న  వీ కి ఇది మేలు చేస్తుంది. ఈ  కంపెనీ ఆర్పూ పెరిగితే కంపెనీ ఫైనాన్స్‌‌‌‌పై ఇన్వెస్టర్లకు నమ్మకం కలగొచ్చు.  ప్రస్తుత ఏడాదిలో ఆర్పూ రూ.200 కి, రానున్న సంవత్సరాల్లో రూ.300 కి పెరగాల్సిన అవసరం ఉందని  టెల్కోలు చెబుతున్నాయి.