కామారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షం

కామారెడ్డి జిల్లాలో  మోస్తరు వర్షం

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో  పలు చోట్ల శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మోస్తరు​ వర్షం కురిసింది.  రాజంపేట మండలం ఆర్గొండలో 74 మి.మీ. వర్షపాతం నమోదైంది. 

నస్రుల్లాబాద్​లో 57.3 మి.మీ., దొమ్మదేవునిపల్లిలో 53.8 మి.మీ., జుక్కల్​లో 43 మి.మీ., బాన్సువాడ మండలం కొల్లూర్​లో 41.8 మి.మీ., కామారెడ్డిలో 39.8 మి.మీ., దోమకొండలో 39.8 మి.మీ., పాతరాజంపేటలో 39.3 మి.మీ., తాడ్వాయిలో 6.3 మి.మీ., రామారెడ్డిలో 36 మి.మీ., పుల్కల్​లో 31.5 మి.మీ., బీర్కూర్​లో 30 మి.మీ., లచ్చాపేటలో 25. 8 మి.మీ., ఎల్పుగొండలో 21 మి.మీ., బిచ్​కుందలో 20.8 మి.మీ., వర్సపాతం నమోదైంది.  ఆదివారం పొద్దంతా ఆకాశం మబ్బు పట్టి ఉంది. అక్కడక్కడ చిరు జల్లులు కురిశాయి.