దేశవ్యాప్తంగా ‘మోదీ 3.0’ పాదయాత్రలు

దేశవ్యాప్తంగా ‘మోదీ 3.0’ పాదయాత్రలు

న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి  పగ్గాలు చేపట్టి జూన్ 9 నాటికి ఏడాది పూర్తి కానున్న  సందర్భంగా దేశమంతటా కార్యక్రమాలు  చేపట్టేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నది. మోదీతో మెగా ర్యాలీలు, కేంద్రమంత్రులతో పాదయాత్రలు నిర్వహించాలని భావిస్తున్నది. ఈ కార్యక్రమాలను ఫైనల్ చేసేందుకు కమిటీని నియమించింది. కేంద్రమంత్రులు తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించేలా ప్లాన్ రూపొందించామని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వాళ్లు ప్రతి వారంలో రెండ్రోజులు 20 నుంచి 25 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహిస్తారని తెలిపాయి.