
తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆవిష్కరణకు తెలంగాణ కేంద్రంగా ఉందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రంలో ఎందరో ప్రతిభావంతులు ఉన్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి ఇలాగే కొనసాగాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నానని తెలిపారు
Also Read :సచివాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూన్ 2 నుంచి 22 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి గోల్కొండ కోటలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు,అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభిస్తున్నారు.