
ఆంధ్రప్రదేశ్ : మోడీ గో బ్యాక్ నినాదాలతో ఏపీ వేడెక్కింది. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసనలు చేశారు టీడీపీ కార్యకర్తలు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన తెలిపారు. నల్ల బెలూన్లు, దుస్తులతో నిరసనలో పాల్గొన్నారు కార్యకర్తలు. మోడీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.
మరోవైపు విజయవాడ దుర్గా ఘాట్ దగ్గర సినీనటుడు శివాజీ జలదీక్షకు దిగారు. మోదీ పర్యటన ముగిసేవరకు శివాజీ దీక్ష చేయనున్నారు. కారెం శివాజీ తో పాటు పలువురు యువకులు శివాజీ దీక్షకు మద్దతు తెలిపారు.
మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ కర్నూల్ మాజీ మేయర్ బంగి అనంతయ్య వినూత్న నిరసన తెలిపారు. కర్నూల్ లోని తన నివాసం నుంచి కలెక్టరేట్ వరకు నల్లజెండాలతో గాడిదపై ర్యాలీ చేశారు. విభజన హామీలు నెరవేర్చలేదని.. ఏపీకి మోడీ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు బంగి అనంతయ్య. ఏపీకి రావాల్సిన నిధులివ్వాలని కోరారు.