జులై 17న హైదరాబాద్‌‌లో 6,590 కిలోల డ్రగ్స్ ధ్వంసం

జులై 17న హైదరాబాద్‌‌లో 6,590 కిలోల డ్రగ్స్ ధ్వంసం

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా లక్షా 44 కిలోల డ్రగ్స్‌‌ను నార్కోటిక్స్‌‌ కంట్రోల్‌‌ బ్యూరో (ఎన్‌‌సీబీ) ధ్వంసం చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో హైదరాబాద్‌‌లో 6,590 కిలోల డ్రగ్స్‌‌ను నాశనం చేయనున్నట్లు తెలిపింది. డ్రగ్స్ స్మగ్లింగ్.. నేషనల్ సెక్యూరిటీ అనే అం శంపై సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. పలు రాష్ట్రాల్లో పట్టుబడిన దాదాపు రూ.2,416 కోట్ల విలువైన డ్రగ్స్‌‌ను ధ్వంసం చేయనున్నారు. 

ALSO READ :అనుకున్న దిరూ.37 వేల కోట్లు.. వచ్చింది రూ.28 వేల కోట్లే

అత్యధికంగా మధ్యప్రదేశ్‌‌లో 1,09,881 కిలోల డ్రగ్స్‌‌ను నాశనం చేయనున్నారు. గుజరాత్‌‌లో 4,277 కిలోలు, జమ్మూ కాశ్మీర్‌‌‌‌లో 4,069 కిలోలు, హర్యానాలో 2,458 కిలోలు, అస్సాంలో 1,486 కిలోలు, ఇండోర్‌‌‌‌లో 822 కిలోలు, చండీగఢ్‌‌లో 29 కిలోలు, గోవాలో 25 కిలోల డ్రగ్స్‌‌ను ఆయా రాష్ట్రాల్లో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ అధికారులు ధ్వంసం చేస్తారు. ఇండియాను డ్రగ్స్ ఫ్రీ దేశంగా మార్చే లక్ష్యంతో మోదీ సర్కార్ పాలసీని తీసుకొచ్చిందని కేంద్రం తెలిపింది.