ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్,వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ పేద మధ్యతరగతి, రైతు కుటుంబాల ఆత్మగౌరవం పెంచారని ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. కిసాన్ సమ్మా న్ నిధి యోజన నిధులు విడుదలైన సందర్భంగా సోమవారం ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం వద్ద ఆయన రైతులతో కలిసి ప్రధాని నరేంద్రమోడీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ లక్షలాదిమంది కుటుంబాలకు మోడీ పెట్టుబడి ఇస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్‌‌, కిసాన్ మోర్చా అధ్యక్షుడు దయాకర్, లీడర్లు లాలా మున్నా, ఆకుల ప్రవీణ్, దినేశ్​మాటోలియ, జోగు రవి, వేద వ్యాస్, రాజేశ్, నగేశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పీఎంఏఏజీవై కింద 39 గ్రామల ఎంపిక ..

మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి ఆడి ఆవాస్ యోజన ( పీఎంఏఏవై) పథకం కింద కేంద్ర ప్రభుత్వం తొలివిడతగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లాలో 39 గిరిజన గ్రామాలు ఎంపిక చేసినట్లు ఎంపీ తెలిపారు. గ్రామాల్లో కనీస అవసరాలు తీర్చేందుకు రూ. 7.80 కోట్లు విడుదల అయ్యాయన్నారు. త్వరలో గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామన్నారు. మారుమూల గిరిజన గ్రామాలను ఆదర్శంగా తీర్చిదింద్దేందుకు ఒక్కో గ్రామానికి తొలివిడతగా రూ.20 లక్షలు విడుదలయ్యాయన్నారు. దశలవారీగా ఉమ్మడి జిల్లా పరిధిలో 204 గ్రామాల్లో నిరంతర అభివృద్ధి పనులు చేపడుతామన్నారు.

కాల్వకు రిపేర్​ చేయాలని రైతుల ఆందోళన

నిర్మల్,వెలుగు: నాలుగు నెలల క్రితం తెగిన సదర్మాట్​మెయిన్​కెనాల్​ను రిపేర్​చేయించాలని డిమాండ్​ చేస్తూ  రైతులు సోమవారం కలెక్టరేట్​ను​ ముట్టడించారు. సదర్మాట్ కాల్వ సాధన సమితి ఆధ్వర్యంలో ఖానాపూర్, కడెం ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో నిర్మల్​కు తరలివచ్చారు. ఈ సందర్భంగా సదర్మాట్ కాల్వ సాధన సమితి ప్రతినిధులు మాట్లాడుతూ  ఖానాపూర్ మండలం ఎల్లాపూర్, గోసంపల్లె ఏరియాలోని కాల్వ తెగిపోవడంతో ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందడం లేదన్నారు. వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్​ ముషారఫ్​అలీ ఫారూఖీకి వినతిపత్రం అందజేశారు. రైతుల ఆందోళనకు బీజేపీ లీడర్లు రాథోడ్​సుమన్​బాయి, పెంబీ జడ్పీటీసీ జానుబాయి మద్దతు తెలిపారు. నిరసనలో ప్రతినిధులు హపావత్ రాజేందర్ నాయక్, గంగాధర్, గంగన్న, స్వామి, లింగన్న, భాస్కర్, రాజన్న, మహేశ్, నరేశ్ తదితరులు ఉన్నారు.

దళితులను మోసం చేస్తున్న కేసీఆర్​

బెల్లంపల్లి రూరల్,వెలుగు: అమలుకు నోచుకోని హామీ ఇచ్చి సీఎం కేసీఆర్​దళితులను మోసం చేస్తున్నాడని బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి కొయ్యల ఏమాజీ విమర్శించారు. సోమవారం ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కన్నెపల్లి, రెబ్బెన, నెన్నెల మండలం నందులపల్లి, గుండ్లసోమారం దళిత కాలనీల్లో పర్యటించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు జనాలకు వివరించారు. కార్యక్రమంలో బీజేపీ నెన్నెల మండల అధ్యక్షుడు శైలేందర్​సింగ్, ఉపాధ్యక్షులు రాజన్న, శివలింగు, జిల్లా కార్యదర్శి కొయిల్కర్​ గోవర్దన్, అజ్మీర శ్రీనివాస్, కన్నెపల్లి మండల ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కన్నెపల్లి నవీన్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎరుకల నర్సింగ్, మండల అధ్యక్షుడు కోట రాజలింగు, లీడర్లు వెంకటేశ్, శ్రావణ్​ తదితరులు పాల్గొన్నారు.  

దళితులను చిన్నచూపు చూస్తున్రు

బెల్లంపల్లి,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం దళితులను చిన్నచూపుచుస్తోందని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సబ్బని రాజనర్సు ఆరోపించారు. సోమవారం ఆయన బెల్లంపల్లిలో  కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎరుకల నర్సింగ్, లీడర్​నక్క రాజలాంగు పాల్గొన్నారు.

పోడు భూములకు పట్టాలు ఇయ్యాలె

మంచిర్యాల,వెలుగు:తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వివిధ గ్రామాలకు చెందిన రైతులు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్​సెల్​కు మందమర్రి, భీమారం, జన్నారం, కోటపల్లి మండలాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వినతిపత్రాలు అందించేందుకు పొద్దటి నుంచే బారులుతీరారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో గ్రీవెన్స్ సెల్​లో అందజేసి వెళ్లిపోయారు. జన్నారం మండలం అక్కపెల్లిగూడెం సర్వేనంబర్ 270 పక్కన గల అటవీ భూమిని ఏండ్లుగా సాగు చేసుకుంటున్నామని రైతులు తెలిపారు. ప్రభుత్వం సర్వే చేసి తమకు పట్టాలు ఇవ్వాలని కోరారు. భీమారం మండలం పోలంపల్లి శివారులోని సర్వేనంబర్ 384లో పోడు భూములు సాగు చేసుకుంటున్న ఎస్టీలకు పట్టాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. 1998 నుంచి పంటలు వేస్తున్నామని, మధ్యలో కొన్నేండ్లు బీళ్లుగా వదిలేయడంతో ఫారెస్ట్ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. కోటపల్లి మండలం కొండపల్లి గ్రామంలో 60 మంది ఎస్టీ రైతులు 2002 నుంచి గ్రామ శివారులోని 200 ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నామని తెలిపారు. 2012 నుంచి ఫారెస్ట్ ఆఫీసర్లు దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారని వాపోయారు. 

అత్యవసర సేవలు అస్తవ్యస్తం

ఆదిలాబాద్,వెలుగు: రిమ్స్ హాస్పిటల్​లో అంబు లెన్స్ సర్వీసు అస్తవ్యస్తంగా మారిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆరోపించారు. సోమవారం ఆయన రిమ్స్ ను సందర్శించారు. అదే టైంలో ఓ బాలింత 102 అంబులెన్స్ కోసం నాలుగు గంటలు గా పడిగాపులు కాస్తున్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటన కేసీఆర్ పాలనకు ఒక చిన్న ఉదాహరణ అని చెప్పారు. బహిరంగ సభల్లో ప్రజలను మభ్యపెట్టడానికి సీఎం కేసీఆర్ 108, 102 అంబులెన్స్ అందించామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.

రోడ్డు పనుల్లో జాప్యంతో ప్రజల అవస్థలు

చెన్నూర్​, వెలుగు: చెన్నూర్​లో జలాల్ పెట్రోల్ బంక్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో జాప్యం వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్​ సుద్దపల్లి సుశీల్​కుమార్​ అన్నారు. పనులు ప్రారంభించి మూడేండ్లు అవుతోందని, త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు గుంతలుగా మారడంతో ద్విచక్ర వాహనదారులు కిందపడుతున్నారని, అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. దుమ్ము లేవకుండా నీళ్లు చల్లకుండానే కాంట్రాక్టర్ అధికారులతో కుమ్ముకై నీళ్లు చల్లినట్టు బిల్లులు లేపుతున్నాడని ఆరోపించారు. దుమ్ముతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్, గడ్డిపల్లి సంతోష్, దమ్మ సంజయ్, కొరికొప్పుల వంశీగౌడ్ పాల్గొన్నారు. 

రాష్ట్ర స్థాయిలో సత్తాచాటాలి

ఇచ్చోడ,వెలుగు: ఏటూరునాగారంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీ గిరిజన విద్యార్థులు సత్తాచాటాలని పీవో వరుణ్​రెడ్డి కోరారు. సోమవారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లో 24 రోజుల పాటు జరిగిన క్రీడా శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా పోటీల్లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో డీడీ దిలీప్ కుమార్, ఆత్రం భాస్కర్, జిల్లా గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారథి, ఏటీడీవో క్రాంతి, హెచ్ఎం చందన, రాథోడ్ ప్రకాశ్, రాథోడ్ ఉత్తమ్, గిరిజన పీఈటీల సంఘం రాష్ట్ర లీడర్​భూక్యా రమేశ్​తదితరులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమం కోసమే కిసాన్ సమ్మాన్ నిధి

నిర్మల్,వెలుగు: కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తోందని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రాంనాథ్​చెప్పారు. సోమవారం నిర్మల్ మండలం ముఠాపూర్ గ్రామంలో రైతు విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రావుల రాంనాథ్​మాట్లాడుతూ సీఎం కేసీఆర్​రైతు రుణమాఫీ హామీని విస్మరించారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం రైతుల పక్షపాతన్నారు. రైతులంతా మోడీ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తోకల అనిల్, మండల ఉపాధ్యక్షుడు  శ్రీనివాస్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మల్లయ్య యాదవ్, పార్టీ లీడర్లు గరిగంటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.