
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. దేశంలోని రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి బాధపడుతోంటే… మరోవైపు ప్రధాని మోడీ వారిని పట్టించుకోకుండా 15 మంది బడా పారిశ్రామిక వేత్తలకు చెందిన రూ.5,50,000కోట్ల రుణాలను మాఫీ చేశారని ఆరోపించారు. మధ్యప్రదేశ్, హర్యాణా, పంజాబ్, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల రైతులు తమ బాధలు చెప్పుకునేందుకు ఢిల్లీ వెళ్లి నిరసనలు తెలిపారన్నారు. అయినా మోడీ కనీసం ఐదు నిమిషాలైన తన బంగ్లా నుంచి బయటకు వచ్చి వారి బాధలను వినలేదని విమర్శించారు ప్రియాంక గాంధీ.