బెంగాల్ లో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ హింసపై మోడీ సీరియస్

బెంగాల్ లో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ హింసపై మోడీ సీరియస్

బెంగాల్ లో ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ హింసపై ప్రధాని మోడీ సీరియస్ అయ్యారు. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితాల తర్వాత బీజేపీ కార్యకర్తల ఇళ్లు, పార్టీ ఆఫీసులపై దాడులు జరిగాయి. తృణమూల్ కార్యకర్తలే దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పరిస్థితిని విచారించేందుకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా... కోల్ కతా చేరుకున్నారు. రెండు రోజుల పాటు బెంగాల్ లో ఉండనున్న నడ్డా... బాధితుల ఇళ్లకు వెళ్లి మాట్లాడనున్నారు. తాము సిద్ధాంతపరంగా ఎన్నికల్లో పోరాడామని... తృణమూల్ మాత్రం హింసాత్మకంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. దేశ విభజన సమయంలో మాత్రమే ఇలాంటి దారుణాలు జరిగాయన్నారు నడ్డా.