మోదీ, షా,  జ్ఞానేశ్ దేశద్రోహులు.. ఎన్నికల వ్యవస్థను దెబ్బతీశారు: రాహుల్ 

మోదీ, షా,  జ్ఞానేశ్ దేశద్రోహులు.. ఎన్నికల వ్యవస్థను దెబ్బతీశారు: రాహుల్ 
  • సీఈసీ జ్ఞానేశ్ రిజైన్ చేసి అప్రూవర్‌‌‌‌గా మారాలి 
  • కుట్రదారులు అంటూ మోహన్ ​భగవత్, మోదీ, అమిత్​షా, అదానీ ఫొటోలతో స్లైడ్ ప్రదర్శన
  • దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుంటే మౌనంగా ఉండబోమన్న లోక్‌‌ సభ ప్రతిపక్ష నేత

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహులని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వారు దేశ ప్రజల ఓటు హక్కును నాశనం చేశారని, ఎన్నికల వ్యవస్థను దెబ్బతీశారని ఫైర్​అయ్యారు. జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేసి అప్రూవర్‌‌గా మారాలని డిమాండ్ చేశారు. 

మోదీ, షా చేసిన ఓట్ చోరీ కుట్రలపై ఎంక్వైరీ జరుగుతుందని, బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం న్యూఢిల్లీలోని సాయంత్రం ఇందిరా భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలిపారు. అయితే ‘‘రాజ్యాంగ శత్రువులు బయటపడ్డారు. న్యాయం జరుగుతుంది’’ అని రాహుల్ బుధవారమే ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో పోస్టు చేయడం గమనార్హం.

‘రాజ్యాంగంపై దాడి’

సీఈసీ చేసిన పని దేశానికి వ్యతిరేక చర్య అని రాహుల్ అన్నారు. ఇది రాజ్యాంగం, దేశ న్యాయ వ్యవస్థపై దాడిగా ఆరోపించారు. ప్రజల ఓటును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఈ వ్యవహారంపై తమ వద్ద పూర్తి నమ్మకంతో చెప్పగలిగేంత సమాచారం ఉందని చెప్పారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుంటే మేం మౌనంగా ఉండబోం. బాధ్యులకు శిక్ష పడుతుంది’’ అని అన్నారు. 

జ్ఞానేశ్ కుమార్ అప్రూవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారడం దేశభక్తి అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కుట్రదారులు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రముఖ బిజినెస్​మెన్​ అదానీ తదితరుల ఫొటోలతో స్లైడ్ ​ప్రదర్శించారు. అందులో పలువురు నేతలు, జర్నలిస్టులు, ఫిల్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేకర్ల ఫొటోలను ‘పావులు’గా చూపించారు. మోదీ, అమిత్​షా ఈ ‘కుట్ర’లో కీలకమైన వారని, వారు దేశానికి చేసిన నష్టంపై ఎంక్వైరీ జరుగుతుందని చెప్పారు. 

గత మూడేళ్లుగా ఈ అంశాన్ని చెబుతున్నానని, వాస్తవాల ఆధారంగానే మాట్లాడుతున్నానని వివరించారు. ఓటు ప్రజాస్వామ్యానికి పునాది అని రాహుల్ అన్నారు. ఎన్నికల సంఘం కాపాడే ఓటు ద్వారా రాజ్యాంగానికి రక్షణ లభిస్తుందని చెప్పారు. ‘‘ఓటు నాశనమైతే రాజ్యాంగం కూడా నాశనమైనట్టే. రాజ్యాంగం లేకపోతే చట్టాలకు అర్థం ఉండదు. 

చట్టాలు లేకపోతే దేశ వ్యవస్థలకు, సంస్థలకూ అర్థం ఉండదు’’ అని అన్నారు. ఓటుపై దాడి అంటే ప్రతి భారతీయుడి అభిప్రాయంపై దాడేనని తెలిపారు. అందుకే ‘‘ఓటు చోరీ నుంచి చట్టం దొంగతనం.. అక్కడి నుంచి సంస్థల, వ్యవస్థల దొంగతనం’’ జరుగుతోందన్నారు.

‘లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ, అసెంబ్లీల ఎన్నికలు 100% రిగ్గయ్యాయి’

లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ, అసెంబ్లీ ఎన్నికలు రిగ్గయ్యాయని తాను వంద శాతం నమ్మకంతో చెప్పగలనని రాహుల్ అన్నారు. దేశంలో అధికారంలో ఉన్నవారిపై వ్యతిరేకత (యాంటీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కంబెన్సీ) ఒక బలమైన ఫోర్స్ అని చెప్పారు. అది ఎవరినీ వదిలిపెట్టదన్నారు. 1971లో బంగ్లాదేశ్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత కూడా ఇందిరాగాంధీ ఏడాది, రెండేళ్లలోనే తీవ్ర యాంటీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కంబెన్సీ ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. కానీ ఇక్కడ యాంటీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కంబెన్సీ పూర్తిగా మాయమవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 

ఇరాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో సద్దాం హుస్సేన్ పాలనలో, ఉత్తర కొరియాలో కూడా అది లేదని చెప్పలేమని వ్యాఖ్యానించారు. మోదీ, షా, బీజేపీ విషయంలో యాంటీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కంబెన్సీ ఎందుకు కనిపించడం లేదో ఇప్పుడు స్పష్టమువుతోందని అన్నారు. అలాగే ప్రధాని మోదీ, అమిత్ షా ప్రసంగాలకు సంబంధించిన కొన్ని వీడియోలను ప్రదర్శించారు. వాటిలో బీజేపీ 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని అమిత్ షా చెప్పిన మాటను, మోదీ ‘అబ్ కీ బార్ 400 పార్’ అని నినదించిన దృశ్యాలను చూపించారు.