షమీకి 60 ఎకరాల్లో ఫాంహౌస్.. ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా

షమీకి 60 ఎకరాల్లో ఫాంహౌస్.. ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా

వరల్డ్ కప్ లో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ సంచలన బౌలింగ్ తో మెరిశాడు. పాండ్య గాయంతో తుది జట్టులో స్థానం సంపాదించుకున్న ఈ సీనియర్ ఫాస్ట్ బౌలర్ ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. సెమీ ఫైనల్లో 7 వికెట్లు తీసి టీమిండియాను గెలిపించిన షమీ.. 24 వికెట్లతో ఈ మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. వరల్డ్ కప్ లో అద్భుతంగా సాగిన షమీ ప్రయాణం.. రియల్ లైఫ్ లో తన లైఫ్ స్టైల్ ను రాయల్ గా లీడ్ చేస్తున్నాడు. ఒకసారి షమీ ఆస్తుల వివరాలు పరిశీలిస్తే..  

షమీ క్రికెట్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి చాలా డబ్బు సంపాదిస్తున్నాడు. క్రికెటర్ బీసీసీఐతో గ్రేడ్ ఏ కాంట్రాక్ట్‌లో ఉన్న ఈ స్టార్ పేసర్ కు బీసీసీఐ నుంచి ఏటా దాదాపు రూ.5 కోట్లు అందుతుంది. లీగ్‌లు, ఫ్రాంచైజీల నుండి కూడా డబ్బు సంపాదిస్తున్నాడు. నివేదికల ప్రకారం షమీకి 2022లో గుజరాత్ టైటాన్స్ రూ. 6.25 కోట్లు చెల్లించింది. బ్లిట్జ్‌పూల్స్, నైక్, ఆక్టాఎఫ్ఎక్స్ వంటి బ్రాండ్‌లతో భాగస్వామ్యంగా ఉన్న షమీ ఆస్తి విలువ రూ. 45 కోట్లుగా అంచనా వేయబడింది.

ఇవన్నీ ఒక ఎత్తయితే ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహాలో రాజ భవనం లాంటి ఫామ్‌హౌస్‌ని కలిగి ఉన్నాడు. షమీ ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాడని తెలుస్తుంది. నివేదికల ప్రకారం ఈ ఫామ్‌హౌస్ 60 ఎకరాలలో విస్తరించి ఉంది. దీని విలువ దాదాపు రూ. 12-15 కోట్లు. వీటితో పాటు షమీ విలాసవంతమైన టాప్-బ్రాండ్ కార్లను కలిగి ఉన్నాడు. జాగ్వార్ ఎఫ్-రకం (రూ. 99 లక్షలు), BMW 5 సిరీస్ (రూ. 65-69 లక్షలు), ఆడి (రూ. 43 లక్షలు), ఫార్చ్యూనర్ (రూ. 33 లక్షలు) షమీ కలిగి ఉన్నాడు.