
అమ్రోహా (యూపీ): టీమిండియా, సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ షమీకి బెదిరింపులు వచ్చాయి. రూ. కోటి ఇవ్వకపోతే షమీని చంపేస్తామంటూ ఈ–మెయిల్ రావడంతో అతని సోదరుడు హసీబ్ ఫిర్యాదు మేరకు యూపీలోని అమ్రోహా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజ్‌పుత్ సిందర్ అనే వ్యక్తి పేరిట వచ్చిన ఈ– మెయిల్‌లో షమీ నుంచి రూ.1 కోటి డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో హసీబ్ పేర్కొన్నాడు. ఆదివారం మధ్యాహ్నం సిందర్ నుంచి బెదిరింపు రావడంతో హసీబ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు బెదిరింపు మెయిల్‌పై దర్యాప్తు చేస్తున్నారు.