Manchu Family Issue : మోహన్ బాబు ఆగ్రహం.. ఫైటింగ్ వీడియో డిలీట్

 Manchu Family Issue : మోహన్ బాబు ఆగ్రహం.. ఫైటింగ్ వీడియో డిలీట్

సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన మంచు బ్రదర్స్ వివాదంపై మోహన్ బాబు స్పందించారు. తిరుపతిలో ఉన్న మోహన్ బాబు.. ఫోన్ కాల్ ద్వారా మంచు విష్ణు, మనోజ్ లను మందలించారు. అన్నదమ్ములిద్దరికీ నచ్చచెప్పడంతో ఈ వివాదాన్ని సద్దుమనిగింది. అయితే, ఫోన్ లో మోహన్ బాబు.. అన్నదమ్ములిద్దరిపై సీరియస్ అయ్యారు. ఇంటి వివాదం సోషల్ మీడియాలో ఎక్కించినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన విషయాన్ని ఆరా తీసి, సర్ధి చెప్పడంతో.. మనోజ్ వీడియోని డిలిట్ చేశాడు. 

అయితే, సారథి మంచు ఫ్యామిలీకి సన్నిహితుడని తెలుస్తోంది. ఎప్పుడూ మోహన్ బాబు కు దగ్గరగా ఉండే సారథి.. మా ఎలక్షన్స్ టైంలో విష్ణు కుడి భుజంగా వ్యవహరించాడు. అయితే, ప్రస్తుతం సారథి.. విష్ణుకు దూరంగా ఉంటూ.. మనోజ్ ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. ఈ విషయంలో వీళ్ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అయితే, నిన్న రాత్రి విష్ణు సారథి ఇంటికి వెళ్లి.. అతన్ని చితకబాదాడు. ముఖానికి గాయాలైన సారథి.. ఇంటినుంచి పారిపోతూ బయట డోర్ లాక్ చేసి వెళ్లిపోయాడు.

దాడి విషయం తెలుసుకున్న మనోజ్, లక్ష్మి.. వెంటనే సారథి ఇంటికి వెళ్లారు. అప్పుడు జరిగిన వివాదమే మనోజ్ సోషల్ మీడియాలో స్టోరీగా పోస్ట్ చేశాడు. తనను ఏం చేయలేకనే సారథిపై దాడి చేశాడని మనోజ్ ఆరోపించాడు. తర్వాత మనోజ్, లక్ష్మి.. సారథిని హాస్పిటల్ లో చేర్చారు. అయితే, ప్రస్తుతం సారథి పరిస్థితి ఎలా ఉంది? ఏ హాస్పిటల్ లో జాయిన్ చేశారు? అన్న విషయాలు బయటికి తెలియకుండా మంచు కుటుంబం గోప్యంగా ఉంచుతోంది.