
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబం భేటీ అయింది. సోమవారం ఉదయం కుమారుడు మంచు విష్ణు, కుమార్తె లక్ష్మీ ప్రసన్న, కోడలు విరోనిక కలసి మోహన్ బాబు ప్రధానిని కలిశారు. దాదాపు అరగంటకు పైగా మోదీతో మోహన్‌బాబు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా.. బీజేపీలో చేరాలని మోహన్‌బాబును మోడీ ఆహ్వానించినట్లు తెలిసింది. అందుకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం 6 గంటలకు గంటలకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాని మోహన్‌బాబు కలవనున్నారు .ప్రస్తుతం వైసీపీలో ఉన్న మోహన్ బాబు.. బీజేపీలో జాయిన్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం అమిత్ షా కలిసిన తర్వాత ఈ విషయంపై స్పష్టత రానుంది.