రైతు సమస్యలపై.. గ్యాంగ్‌‌ లీడర్‌‌‌‌

రైతు సమస్యలపై.. గ్యాంగ్‌‌ లీడర్‌‌‌‌

మోహన్ కృష్ణ, సౌజన్య, హరిణి రెడ్డి హీరో హీరోయిన్స్‌‌గా శ్రీ లక్ష్మణ్  దర్శకత్వంలో  సింగులూరి మోహన్ రావు నిర్మించిన చిత్రం ‘మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్’. సుమన్ కీలక పాత్ర పోషించారు. జులై 7న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో  సుమన్ మాట్లాడుతూ ‘రైతు సమస్యలపై  తెరకెక్కిన ఈ చిత్రంలో  రైతుగా నటించడం ఆనందంగా  ఉంది.  రైతు లేనిదే..రాష్ట్రం లేదు, దేశం లేదు. అలాంటి బర్నింగ్ ఇష్యూపై రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. ‘గ్యాంగ్ లీడర్‌‌‌‌’ టైటిల్‌‌తో, చిరంజీవి అభిమాని హీరోగా నటించిన ఈ చిత్రాన్ని  చిరు, పవన్ అభిమానులు బిగ్ హిట్ చేస్తారని కోరుకుంటున్నా’ అన్నారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదం ఎంత గొప్పదో ఈ చిత్రంలో చూడొచ్చు అన్నారు శ్రీ లక్ష్మణ్. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ,  లక్ష్మీపతి టీమ్‌‌కి ఆల్ ద బెస్ట్ చెప్పారు.