మలయాళ స్టార్ మోహన్ లాల్‌కు సౌత్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. తెలుగులో అయితే ఆయనకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేసే మోహన్ లాల్ చేతిలో ప్రస్తుతం దాదాపు పది ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో రెండు చిత్రాల రిలీజ్ డేట్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఆదివారం ప్రకటించారు. ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘నెరు’.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరంబవూర్ నిర్మిస్తున్న సినిమాలో ప్రియమణి, అనస్వర రాజన్ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వంలో ‘మలైకొట్టె వాలిబాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు మోహన్ లాల్. ఈ మూవీ టీజర్‌ను ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు, అలాగే సినిమాను జనవరి 25న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో మోహన్ లాల్ డిఫరెంట్ గెటప్‌లో ఇంటెన్స్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నెల రోజుల గ్యాప్‌లోనే మోహన్ లాల్ సూపర్ స్పీడ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
