Drishyam 3 Box Office: ‘దృశ్యం 3’ కలెక్షన్ల సునామీ.. 3 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. తగ్గేదే లేదంటూ భారీ వసూళ్లు

Drishyam 3 Box Office: ‘దృశ్యం 3’ కలెక్షన్ల సునామీ.. 3 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. తగ్గేదే లేదంటూ భారీ వసూళ్లు

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. మే21న విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ అనేక ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. శనివారంతో మూడు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో మోహన్ లాల్ కెరియర్లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ శనివారం (మే23న) ఒక్కరోజే రూ.13.70 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఇందులో మలయాళ వెర్షన్ నుంచి అత్యధికంగా రూ.11.65 కోట్లు రాగా, తెలుగు వెర్షన్ రూ.1.2 కోట్లు, తమిళం రూ.60 లక్షలు, కన్నడ వెర్షన్ రూ.25 లక్షలు వసూలు చేశాయి. దీంతో ఇండియాలో మూడు రోజుల్లో మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ.47.17 కోట్లకు చేరుకోగా, నెట్ కలెక్షన్లు రూ.40.60 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.

ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. శనివారం ఒక్కరోజే ఓవర్సీస్‌లో రూ.25 కోట్లు రాబట్టి, మొత్తం విదేశీ మార్కెట్లలో రూ.70 కోట్ల గ్రాస్‌ మార్క్ అందుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ.117.17 కోట్ల క్లబ్లో చేరి బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగిస్తోంది. ముఖ్యంగా తమిళం, కన్నడతో పోలిస్తే తెలుగులోనే చిత్రానికి ఎక్కువ ఆదరణ లభించడం విశేషం.

►ALSO READ | నాగార్జున ఎమోషనల్: డిస్ట్రిబ్యూటర్ ‘నెల్లూరు’ హరి కన్నుమూత.. 

దేశవ్యాప్తంగా 5,185 షోలలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం మే 23న మొత్తం 50.2 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. మలయాళ వెర్షన్‌కు అత్యధికంగా 66.52 శాతం ఆక్యుపెన్సీ నమోదవగా, తమిళ వెర్షన్‌కు 50.69 శాతం స్పందన లభించింది. తెలుగు వెర్షన్ 25.19 శాతం, కన్నడ వెర్షన్ 24.27 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేశాయి. ఆడియన్స్ థియేటర్స్కి పోటెత్తడం చూస్తుంటే, ‘దృశ్యం 3’ మరో భారీ మైల్ స్టోన్ దిశగా దూసుకెళ్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ సినిమాకి ఫస్ట్ డే కంటే సెకండ్ డే మౌత్ టాక్ ఊపందుకుంది. ఈ క్రమంలోనే మోహన్ లాల్ ఫ్యాన్స్ నుంచి థ్రిల్లర్ ఆడియన్స్ వరకు థియేటర్లో క్యూ కడుతున్నారు. అందువల్ల మేకర్స్ సైతం థియేటర్లు పెంచుతూ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు. దర్శకుడు జీతు జోసెఫ్ ఈసారి కథలో సస్పెన్స్ కంటే జార్జికుట్టి కుటుంబ భావోద్వేగాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. చివర్లో దృశ్యం 4కి సంబంధించిన హింట్ కూడా ఇవ్వడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.