Mohanlal: తెలుగు కుర్రహీరోలకి పోటీగా మోహన్ లాల్.. దీపావళి రేసులో ఫాంటసీ యాక్షన్ ‘వృషభ’

Mohanlal: తెలుగు కుర్రహీరోలకి పోటీగా మోహన్ లాల్.. దీపావళి రేసులో ఫాంటసీ యాక్షన్ ‘వృషభ’

మలయాళ స్టార్ మోహన్ లాల్ నుంచి వస్తున్న చిత్రం ‘వృషభ’. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి నంద కిషోర్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్‌‌తో క‌‌లిసి అభిషేక్ వ్యాస్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని   నిర్మిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌‌ జరుగుతున్నాయి.

గురువారం టీజర్‌‌‌‌ను విడుదల చేశారు.  ఓ రాజభవనంలో రాణి పురిటి నొప్పులు పడుతున్న సీన్‌‌తో టీజర్ మొదలైంది. ఆ తర్వాతి సీన్స్‌‌లో కింగ్‌‌ గెటప్‌‌లో కనిపించిన మోహన్‌‌ లాల్.. టెంపుల్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో శత్రువులతో పోరాడుతూ కనిపించారు. విజువల్స్‌‌తో పాటు యాక్షన్‌‌ సీన్స్‌‌ టీజర్‌‌‌‌లో హైలైట్‌‌గా నిలిచాయి.

చివర్లో కొడుకు ఒడిలో తండ్రి పడుకుని సేద తీరుతున్నట్టుగా ఉన్న సీన్‌‌తో ఇది తండ్రీ కొడుకుల అనుబంధం, పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిదని అర్థమవుతోంది. సమర్జిత్ లంకేష్‌‌, రాగిణి ద్వివేది, నయన్ సారిక, నేహా సక్సేనా, రామచంద్రరాజు కీలకపాత్రలు పోషించారు.

దీపావళి సందర్భంగా ‘వృషభ’ అక్టోబర్ 16న సినిమా విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. దీపావళి రేసులో తెలుసు కదా, K-ర్యాంప్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.

బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో  స్పీడ్‌‌గా సినిమాలు చేసే హీరోల్లో మలయాళ స్టార్ మోహన్ లాల్ ముందు వరుసలో ఉంటారు. ఇటీవలే తన 365 వ సినిమాని అనౌన్స్ చేశాడు. ‘ఎల్‌‌ 365’ వర్కింగ్ టైటిల్‌‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆస్టిన్ డాన్ థామస్ దర్శకత్వం వహిస్తుండగా, రితేష్ రవి కథను అందించాడు. ఆ మూవీ షూటింగ్ దశలో ఉండగా, ‘దృశ్యం3’ లైన్ లో పెట్టేశాడు. ఇకపోతే మోహన్ లాల్.. ఇటీవలే, తుడురమ్, L2 ఎంపురాన్, హృదయపూర్వం వంటి సినిమాలతో వచ్చి భారీ విజయాల్ని అందుకున్నారు.