
నమ్మాలనిపించట్లేదా..? నమ్మి తీరాల్సిందే. అరె, గడ్డితప్ప ఏముందని దాంట్ల అన్ని పైసలు పెట్టాలె? అంటరా! క్లాడ్ మోనెట్ అనే పెయింటర్ వేశాడట ఈ పెయింటింగ్. అతడు చాలా ఫేమస్ అట. ఫ్రాన్స్ సొంత దేశం. అతడి పెయింటింగ్స్ కొన్ని మాత్రమే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నాయట. మంగళవారం న్యూయార్క్‌లోని సోథెబీ వేలం సంస్థ దానిని వేలం వేసింది. దానిని పాడుకున్న ఆ మహానుభావుడు ఎవరో తెల్వదుగానీ, 11 కోట్ల డాలర్లు పెట్టేసిండు. మన పైసలల్ల చెప్పాలంటే 778 కోట్ల రూపాయల పైమాటే. ఈ పెయింటింగ్‌ను ఫ్రాన్స్‌లోని గివర్నీలో తన ఇంట్లో గీశాడట. అదీ 1890–1891 మధ్య తన ‘ఇంప్రెషనిస్ట్ ఆర్ట్’ను ఇలా చూపించాడట. ఇగ, ఈ పెయింటింగ్ పేరు మ్యూల్స్ అంట. ఆ సిరీస్‌లో 25 పెయింటింగ్స్ వేస్తే, అందులో ఒకటి ఇది. తన పక్కింటి వ్యక్తి పండించిన పంటను ఒకదగ్గర కుప్ప పెడ్డాట. ఆ కుప్పనే ఇట్ల మ్యూల్స్‌గా మార్చాడన్నమాట. 1926ల 86 ఏళ్ల వయసులో మోనెట్ చనిపోయాడు. వేలంలో 10 కోట్ల డాలర్ల మార్కు దాటిన ఇంప్రెషనిస్ట్ ఆర్ట్ ఇదేనట. మరి, నెటిజన్లు ఊరుకుంటరా. రెచ్చిపోయిండ్రు. ఏముందిరా బాబు దాంట్ల అంతగనం పైసలు కుమ్మరియ్యడానికి అంటూ ట్వీట్లు చేసేశారు.