NRI లు ఇండియాలో సంపాదించే మనీకే ట్యాక్స్

NRI లు ఇండియాలో సంపాదించే మనీకే ట్యాక్స్

న్యూఢిల్లీ : ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐలు విదేశాల్లో పొందే ఆదాయంపై ఇండియాలో పన్ను వేసే ఉద్దేశం ఏమీ లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇండియాలో పొందే ఆదాయంపైనే పన్నులు వేస్తామని చెప్పారు. నాన్ రెసిడెంట్ ఇండియన్స్(ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐల) ట్యాక్స్ చెల్లింపులపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో నిర్మల ఆదివారం క్లారిటీ ఇచ్చారు. ‘ప్రస్తుతం మేము చేస్తున్నదేమిటంటే.. ఇండియాలో ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐలు జనరేట్ చేసే ఆదాయాలపైనే ట్యాక్స్‌‌‌‌లు వేస్తున్నాం. వేరే దేశాల్లో సంపాదించే ఆదాయంపై ఎలాంటి పన్ను లేదు. అక్కడ సంపాదించే వాటిని మా దగ్గర ఎందుకు కలుపుకుంటాం ?’ అని నిర్మలా అన్నారు. ఫైనాన్సియల్ బిల్లు 2020లో ప్రతిపాదించిన ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐల ట్యాక్సేషన్‌‌‌‌పై ఆమె క్లారిటీ ఇచ్చారు.

మార్కెట్​ ఎట్లా ఉండబోతుందో?

కాగా, బడ్జెట్​ వచ్చిన తర్వాత ఫుల్​డే సెషన్​ ఈ రోజు జరగబోతుంది. నిర్మలాసీతారామన్​   ప్రవేశపెట్టిన బడ్జెట్​ శనివారం మార్కెట్​కు నష్టాలు తెచ్చిపెట్టింది. అయితే దీన్ని పట్టించుకోనవసరంలేదని సోమవారం సెషన్​లో అంతబాగుంటుందని నిర్మల అన్న విషయం తెలిసిందే. మరి, స్టాక్​  మార్కెట్​ ఎట్లా రియాక్ట్​ అవుతుందో చూడాలి. బడ్జెట్‌‌ రోజు మార్కెట్లు గత పదేళ్లలో అతిపెద్ద సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డే లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూశాయి.  ఈ వారం కూడా బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభావం మార్కెట్లపై కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనితో పాటు ఈ వారం విడుదల కానున్న ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ మానిటరీ పాలసీ, కీలకమైన స్థూల ఆర్థిక డేటా, క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తాయని అన్నారు. వృద్ధికి బూస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చే పెద్ద చర్యలేవి ప్రకటించకపోవడం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నెగిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభావాన్ని చూపిందని ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాఠీ షేర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రోకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎకనామిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హజ్రా అన్నారు. కొత్త పన్ను విధానం వలన ఈక్విటీ సేవింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేసే ఇన్వెమెంట్లపై కూడా మినహాయింపులు తొలిగిపోయాయన్నారు. ఇది మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందన్నారు.  షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్డర్లపై డివిడెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విధించడంతో డొమెస్టిక్ ఇన్వెస్టర్లపై నెగిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభావం పడుతుందన్నారు. మొత్తంగా బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్లకు ప్రతికూలంగా ఉందన్నారు. వ్యక్తిగత ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్లాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను మార్చడంతో ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేవింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోకి ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లో తగ్గుతుందని విశ్లేషకులు తెలిపారు. కొత్త పన్ను విధానం వలన ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినహాయింపులు ఉండవని,  ఇది మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్గాలను నిరుత్సాహపరిచిందని జియోజిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రీసెర్చ్ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఈ కొత్త పన్ను విధానం వలన ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా నష్టపోతుందని తెలిపారు.

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పాలసీ, క్యార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ముఖ్యమే

బడ్జెట్‌‌తోపాటు మార్కెట్లను షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్యూ3 ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు ప్రభావం చూపుతాయని నాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత మొదటి సారిగా గురువారం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ తన మానిటరీ పాలసీని ప్రకటించనుంది. దీంతోపాటు ఈ వారంలోనే  మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి పీఎంఐ డేటా విడుదల కానుంది.  ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లుపిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మా, మహింద్రా అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహింద్రా వంటి పెద్ద కంపెనీల క్యూ3 ఫలితాలు ఈ వారమే వెలువడనున్నాయి. ఈ అంశాలన్ని మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు తెలిపారు. కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విస్తరిస్తుండడం వంటి అంశాలు గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోజు(శనివారం) సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 987.96 పాయింట్లు నష్టపోయి 39,735.53 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. గత వారం మొత్తంగా చూస్తే సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1,877.66 పాయింట్లు పడిపోయింది.