Monkey Man Trailer 2: ధనవంతులు మనుషులుగా కూడా చూడరు..యాక్షన్,ఎమోషన్తో మంకీ మ్యాన్

Monkey Man Trailer 2: ధనవంతులు మనుషులుగా కూడా చూడరు..యాక్షన్,ఎమోషన్తో మంకీ మ్యాన్

ఒక సాధారణ వ్యక్తికి సూపర్ పవర్స్ వస్తే.. అతను ప్రజలకు ఎలా సహాయ పడతాడు అనేది ప్రతీ సూపర్ హీరో సినిమాల్లో కనిపించే కాన్సెప్ట్. ఇటీవల టాలీవుడ్ లో వచ్చిన హనుమాన్ సినిమాలో కూడా ఇదే చూపించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

దాదాపు అలాంటి కథతోనే వస్తున్న హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ (Monkey Man). ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ స్లమ్ డాగ్ మిలియనీర్’ ‘హోటల్ ముంబై’ ఫేమ్ దేవ్ పటేల్ (Dev Patel) నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మరో ట్రైలర్ ని రిలీజ్ చేస్తూ ఇంట్రెస్ట్ పెంచారు. 

ఈ మూవీలో శోభిత ధూళిపాళ్ళ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి వరకూ తెలుగు, తమిళ మరియు హిందీ భాషల్లో తన ప్రతిభను చాటుకున్న శోభిత..ఇక ఈ హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటబోతుంది. 

లేటెస్ట్గా రిలీజ్ చేసిన ట్రైలర్ ని గమనిస్తే..ఇందులో వెయిటర్ గా కనిపిస్తున్నాడు దేవ్ పటేల్. ఇక ట్రైలర్ లో చూపించిన స్టోరీ విషయానికి వస్తే..చిన్నతనంలోనే తల్లితో పాటుగా సర్వస్వం కోల్పోయిన హీరోకి..‘ధనవంతులు మమ్మల్ని మనుషులుగా కూడా చూడరు’ అంటూ తన గురించి చెప్పుకోవడంతో ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ 2 స్టార్ట్ అయింది.

Also Read :బిగ్ బాస్ ఫేమ్ శ్రీనివాస్ గౌడ అరెస్ట్.. కారణం ఏంటంటే!

పేద ప్రజలను కాపాడే వ్యక్తిగా తాను భావిస్తూ, హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని..అన్యాయాలను ఎదురించి ఫైట్ చేసే యువకుడి కథే ఈ సినిమా అని ట్రైలర్  ని బట్టి అర్థమవుతోంది.అంతేకాకుండా..'ఒక మనిషి దేవుడిని సవాలు చేస్తే..అతను మనిషి కంటే ఎక్కువగా, మృగం కంటే ఎక్కువగా మారాలి” అని చెప్పడం వల్ల మంకీ మ్యాన్ ఎంత ఎమోషన్ గా ఉండబోతుందో అర్ధం చేసుకోవొచ్చు. 

ట్రైలర్ 1 విషయానికి వస్తే..'నా చిన్నతనంలో మా అమ్మ నాకు ఒక కథ చెప్పేది..అనే డైలాగ్‌తో మొదలైన మంకీ మ్యాన్ ట్రైలర్ 1.. రాక్షస రాజు, తన సైన్యం కలిసి ప్రజలను భయపెట్టేవారు. అప్పుడే వారికి ప్రజల రక్షకుడు ఎదురయ్యాడు. ది వైట్ మంకీ.. వంటి డైలాగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక ట్రైలర్ మధ్యలో వచ్చిన హనుమంతుడి రిఫరెన్స్ షాట్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.