ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న కోతి..విస్తుపోతున్న నెటిజన్లు

ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న కోతి..విస్తుపోతున్న నెటిజన్లు

ఈ యాంత్రిక జీవనంలో ప్రతీఒక్కరు  ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా డిజిటల్ ప్రపంచం వైపు మొగ్గుచూపుతున్నారు. డైపర్ దగ్గర నుంచి డైమండ్ వరకు అంతా ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తున్నారు.  పల్లె దగ్గర నుంచి పట్టణాల్లో నివసించే ప్రజలు ఆన్ లైన్ లో షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారంటే డిజిటల్ మేనియా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.  ఒక్క క్లిక్ తో వంటింటి సరుకులతో పాటు వారికి కావాల్సిన వస్తువులన్నీ కొనుగోలు చేయడం సమస్త మానవాళికి విరుద్దమే అయినా..యాంత్రిక జీవితానికి అలవాటు పడిన ప్రాణాలు షాపింగ్ మాల్స్, హోల్ సెల్ షాపులకు వెళ్లాలంటే వెళ్లలేకపోతున్నారు.  అందుకే ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఈ ఆన్ లైన్ షాపింగ్ కు మనుషులే కాదు కోతులు సైతం అలవాటు పడ్డాయి.

చైనాలో మెంగ్ మెంగ్ అనే యువతి ఓ కోతిని పెంచుకుంటుంది. ఆ యువతికి ఇంట్లో నిత్యవసర వస్తువుల్ని ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టడం ఓ అలవాటు. ఎప్పటిలాగే కావాల్సిన ఇంటి సామాగ్రిని ఆర్డర్ పెట్టేందుకు తన ఫోన్ లో బ్రౌజింగ్ చేసింది.  అదే సమయంలో కోతి కి ఆహరం తీసుకునేందుకు బజారుకు వెళుతూ మొబైల్ ను ఇంట్లో వదిలేసి వెళ్లింది. యజమాని కోతికి కావాల్సిన  తినబండరాల్ని తీసుకొచ్చింది. ఇంటికి వచ్చిన మెంగ్ మెంగ్   ఫోన్ లో తమకు కావాల్సిన వస్తువులన్నీ ఆర్డర్ పెట్టినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో కంగుతిన్న యువతి ఇంట్లో సీసీ కెమోరాను చెక్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టింది కోతి అని గుర్తించిన యువతి..కోతి ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తున్న వీడియోను నెట్టింట్లో షేర్ చేసింది.  దీంతో ఆ వీడియోను చూసిన నెటిజన్లు కోతిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.