ఎయిర్ ఇండియా ప్రమాదంపై దర్యాప్తు నిజాయితీగా సాగుతోంది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఎయిర్ ఇండియా ప్రమాదంపై దర్యాప్తు నిజాయితీగా సాగుతోంది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

2025 జూన్ 12న అహ్మదాబాద్ లో 260 మందిని బలిగొన్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని.. దర్యాప్తు తర్వాత తుది నివేదికలో అన్ని వాస్తవాలు వెల్లడిస్తామని అన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని అన్నారు రామ్మోహన్ నాయుడు. విమాన ప్రమాద బాధితులందరికీ సమన పరిహారం అందిస్తామని అన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు. 

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరుగుతోందని.. తుది నివేదిక వచ్చే వరకు మీడియా ఊహాగానాలకు దూరంగా ఉండాలని కోరారు మంత్రి రామ్మోహన్ నాయుడు. AAIB దర్యాప్తు పారదర్శకంగా నిర్వహిస్తోందని.. ఇండియన్ మీడియా మాత్రమే వెస్ట్రన్ మీడియా కూడా దర్యాప్తుపై సొంత కథనాలు ప్రచారం చేస్తోందని అన్నారు. వాస్తవాల ద్వారా దర్యాప్తు జరుగుతోందని.. నిస్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని.. దర్యాప్తు పూర్తైన తర్వాతనే వాస్తవాలు వెల్లడవుతాయని అన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు.

ALSO READ : మల్లికార్జున ఖర్గేకు బర్త్ డే విషెస్ చెప్పిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణ

ఈ  మరణించిన హాస్టల్ విద్యార్థులతో సహా మరణించిన అందరికీ సంతాపం తెలియజేస్తున్నానని... బాధితులందరికీ అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలిపారు రామ్మోహన్ నాయుడు. బాధితులందరికీ సమాన పరిహారం అందుతుందని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. సోమవారం ( జులై 21 ) ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చకు ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుబడటంతో లోక్ సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభ మొదలైన కాసేపటికే వాయిదా పడింది.