నైరుతి తిరోగమనం ప్రారంభం

నైరుతి తిరోగమనం ప్రారంభం

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టాయి. సోమవారం రాజస్థాన్​ లోని కొన్ని ప్రాంతాల నుంచి ఉపసంహరించుకున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. సాధారణంగా ఈ నెల 17న నిష్క్రమించాల్సిన రుతుపవనాలు ఈ సారి 8 రోజులు లేట్​గా వెనుతిరుగుతున్నాయని తెలిపింది. వరుసగా 13 ఏండ్లుగా ఇలాగే ఆలస్యంగా తిరోగమనం పడుతున్నాయని చెప్పింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్1 నాటికి కేరళ తీరాన్ని తాకి, జులై 8 నాటికి దేశమంతటా విస్తరిస్తాయి.

అక్టోబర్ 15 నాటికి పూర్తిగా నిష్క్రమిస్తాయి. అయితే ఈ సారి ఆలస్యంగా జూన్ 8న ప్రారంభమయ్యాయి. తిరోగమనంలోనూ 8 రోజులు ఆలస్యం అవుతున్నాయి. తిరుగుముఖం పట్టిన తర్వాత ఇవి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయి. ఈ క్రమంలో ఏర్పరిచే చక్రవాతాల కారణంగా తిమిళనాడు, ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. కాగా, ఈ ఏడాది నైరుతి కాలంలో దేశవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది.