బాసరలో ఘనంగా మూలా నక్షత్ర పూజలు

బాసరలో ఘనంగా మూలా నక్షత్ర పూజలు

బాసర, వెలుగు: నిర్మల్  జిల్లాలోని బాసర సరస్వతీ దేవి పుణ్యక్షేత్రంలో మూలా నక్షత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం వేకువజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఆలయంలో 1,880 అక్షరాభ్యాసాలు జరిగాయి. 

పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్యూ లైన్ లు భక్తులతో కిటకిటలాడాయి. కలెక్టర్  అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో ఆలయ ఈవో అంజనాదేవి ఏర్పాట్లు చేపట్టారు. బాసర వద్ద గోదావరి నది ఉధృతి కొనసాగుతుండడంతో నదిలో స్నానాలను నిషేధించారు. 

కలెక్టర్  అభిలాష దంపతులు, ఎంపీ నగేశ్, ముథోల్  ఎమ్మెల్యే రామారావు పటేల్, బోథ్​ ఎమ్మెల్యే అనిల్ జాదవ్  తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.