మూన్​ టూ మార్స్​ ప్రాజెక్ట్​ చీఫ్​ అమిత్​ క్షత్రియ

మూన్​ టూ మార్స్​ ప్రాజెక్ట్​ చీఫ్​ అమిత్​ క్షత్రియ

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)లో నూతనంగా ఏర్పాటు చేసిన మూన్​ టూ మార్స్​ ప్రాజెక్ట్​ తొలి చీఫ్​గా భారత సంతతికి చెందిన సాఫ్ట్​వేర్, రోబోటిక్స్​ ఇంజినీర్ అమిత్​ క్షత్రియ నియమితులయ్యారు. మానవాళి ప్రయోజనాల కోసం చంద్రుడు, అంగారక గ్రహాలపై జీవరాశి అన్వేషణ కార్యకలాపాలను నిర్వహించడం కోసం ఈ ప్రాజెక్టును నాసా చేపట్టింది. చంద్రుడిపై సుదీర్ఘకాలం మకాం వేయడానికి, అక్కడి నుంచి అంగారక గ్రహంపైకి మనుషులను పంపాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 

2003 నుంచి అమిత్ క్షత్రియ అంతరిక్ష కార్యకలాపాల్లో పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు భారత్​ నుంచి అమెరికా వలస వెళ్లారు. అమిత్​ క్షత్రియ విస్కాన్సిన్​లోని బ్రూకఫీల్డ్​లో పుట్టారు. సాఫ్ట్​వేర్​, రోబోటిక్స్​ ఇంజినీర్​గానే కాకుండా స్పేస్​క్రాప్ట్​ ఆపరేటర్​గానూ నాసాలో సేవలందించారు. 2014 నుంచి 2017 వరకు స్పేస్​ స్టేషన్​ ఫ్లైట్​ డైరెక్టర్​ బాధ్యతలు నిర్వర్తించారు. అమిత క్షత్రియ సేవలకుగాను నాసా అవుట్​ స్టాండింగ్​ లీడర్​షిప్​ మెడల్​, సిల్వర్​ స్నూపీ అవార్డు పొందారు.