Pushpa 2: మరో 100 రోజులు.. పుష్ప- 2 కొత్త పోస్టర్ రిలీజ్

Pushpa 2: మరో 100 రోజులు.. పుష్ప- 2 కొత్త పోస్టర్ రిలీజ్

అల్లు వారసుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సీక్వెల్ "పుష్ప 2: ది రూల్" చిత్రం ఈ ఏడాది చివరన కానున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియోటర్లలోకి రానుంది. అందుకు మరో 100 రోజుల సమయముండగా.. ఆ గడువును తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. 

పుష్ప పార్ట్ -1 సక్సెస్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందునా పార్ట్-1కు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని సుకుమార్ చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. అందువల్లే, ఈ చిత్రం షూటింగ్ చాలా నెమ్మదిగా సాగుతోంది. తొలుత ఈ మూవీ ఆగష్టు 15న థియోటర్లలోకి రానుందని ప్రకటించినప్పటికీ.. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తికాకపోవడంతో వాయిదా వేశారు. అప్పటినుంచి మేకర్స్ ఎప్పటికప్పుడు మూవీకి సంబంధించిన అప్‌డేట్లను ఒక్కొక్కటిగా అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.

ఇంకో 100 రోజులు

'పుష్ప 2: ది రూల్' 100 రోజుల్లో వచ్చేస్తోందంటూ మేకర్స్ కొత్త  పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పుష్ప రాజ్ (అల్లు అర్జున్) ఎడమ చేతిని పైకెత్తి అభివాదం చేస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.