దడ పుట్టిస్తున్న కరెంట్ బిల్లులు

దడ పుట్టిస్తున్న కరెంట్ బిల్లులు

పెద్దపల్లి జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు ఎండాకాలం రాకముందే చెమటలు పడుతున్నాయి. కూలి పనిచేసుకునే వాళ్లకు వేలల్లో కరెంట్ బిల్లులు వస్తున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని తమకు అధిక మొత్తంలో బిల్లులు వేయడమేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో రెండు బల్బులు, ఓ ఫ్యాన్ మాత్రమే ఉన్నా.. తమకు రూ. 4 వేల బిల్లు వేశారని వాపోతున్నారు. ప్రతినెలా తమకు 150 నుంచి 200 మధ్యలో బిల్లు వచ్చేదని.. కానీ ఇప్పుడు మాత్రం వేలల్లో బిల్లులు వస్తున్నాయని అంటున్నారు. అంత మొత్తంలో చెల్లించలేమని చెబితే.. బిల్లు కడతారా లేక జైలుకు పోతారా అని అధికారులు బెదిరిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. ఇంట్లో ఉన్న సామాను అమ్మి అయినా సరే బిల్లులు కట్టాలని విద్యుత్ అధికారులు అంటున్నారని వాపోతున్నారు. ఎస్సీలకు ఫ్రీ కరెంట్ అని కేసీఆర్ మాటలు చెప్పాడని.. చేతల్లో అవి అమలైతలేవని అంటున్నారు.

For More News..

మేడారం జాతరకు హెలికాఫ్టర్ సర్వీసులు.. చార్జీలు ఎంతంటే

కేసీఆర్కు ఫోన్ చేసి మద్దతు ప్రకటించిన దేవెగౌడ