Good Health: కివి తింటే లక్ష లాభాలు.. భలే నిద్ర.. మస్తు ఆరోగ్యం..

Good Health: కివి తింటే లక్ష లాభాలు.. భలే నిద్ర..  మస్తు ఆరోగ్యం..

Kiwi Health Benefits: కివీ.. ఇది విదేశీ పండైనా, ఇప్పుడు లోకల్‌లోనూ చాలా ఫేమస్‌ అయిపోయింది. కివీని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. దీన్ని చైనీస్ గూస్‌బెర్రీ అని కూడా పిలుస్తారు. మన దేశంలో ఫుజీరకం కివి దొరుకుతుంది.  ఈ పండులో ఆరోగ్యపరంగా లక్ష లాభాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కివి పండును తింటే ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం. . 

 ప్రజలు తమ డైట్ లో కచ్చితంగా పండ్లను చేర్చుకోవాలని వైద్యనిపుణులు చెబుతుంటారు. పండ్లను తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు. నిజానికి, పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే కొన్ని రకాల  పండ్లను పోషకాల నిధిగా చెబుతారు. ఈ పండ్లలో ఒకటి కివి. ఇది రుచిలో తియ్యగా, పుల్లగా ఉంటుంది. అందుకే చాలామంది దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అయితే తియ్యగా, పుల్లగా ఉంటే ఈ కివీ అనేక తీవ్రమైన వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. 

US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం, కివీలో విటమిన్లు A, E, C, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో మంచి మొత్తంలో విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఒక కప్పు కివీ ముక్కలలో.. మనకు రోజుమొత్తం సరిపడా విటమిన్‌ సీ లభిస్తుంది. ఇది శరీరంలో కణజాలాల పెరుగుదలకు, మరమ్మత్తుకు చాలా అవసరం. కివీలో ఫైబర్‌ మెండుగా ఉంటుంది. ఇది పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఈ అద్భుతమైన పండును మీ ఆహారంలో చేర్చుకుంటే.. చాలా ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కివిని ఏ సమయంలో తినాలి 

కివి తినడానికి సరైన సమయం ఉదయం. కివిలో పుష్కలంగా పోషకాలు ఉన్నాయి. కివి ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. పుల్లటి పండ్లను ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ సమస్యలు వస్తాయి కాబట్టి ఖాళీ కడుపుతో తినకుండా కాస్త బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత తినడం మంచిది.

కివితో కలిగే ప్రయోజనాలు..

1.రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు రోజుకు ఒక కివీని తినాలంటున్నారు నిపుణులు.  ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.   కివిలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన, మృదువుగా ఉండే చర్మానికి కీలకమైన పోషకం. USDA డేటా ప్రకారం, ఒక 100-గ్రాముల కివి రోజువారీ విటమిన్ సి అవసరంలో 154% వరకు అందిస్తుంది. కివిలో వృద్ధాప్యం, ముడతలను నిరోధించే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. కివీని పచ్చిగా తినవచ్చు లేదంటే చర్మానికి పేస్ట్ గా చేసి అప్లై చేసుకోవచ్చు. చర్మాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్స్ కివీలో పండులో ఉన్నాయి. సూర్యరశ్మి, వాయు కాలుష్యం, పొగ వల్ల చర్మం పాడవకుండా ఉండేందుకు కివీ దోహదపడుతుంది.

2. కివీ పండులో అద్భుతమైన పొటాషియం కంటెంట్ కారణంగా రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది స్ట్రోక్ .. టైప్-2 మధుమేహం వంటి ఇతర వ్యాధులపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది.

3. జీర్ణక్రియకు కివీ చాలా మంచిది. ప్రతి 100 గ్రాముల కివీ 3 గ్రాముల వరకు ఫైబర్‌ ఉంటుంది. USDA డేటా ప్రకారం రోజువారీ ఫైబర్ తీసుకోవడంలో 12% వరకు కివీని తీసుకోవటం ద్వారా పొందవచ్చు. డైటరీ ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండటానికి సహాయపడుతుంది.  సాఫీగా.... ఆరోగ్యకరమైన జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. కివిలో ప్రోటీన్-కరిగిపోయే ఎంజైమ్ ఉంది, ఇది తిన్నఆహారాన్ని చాలా వేగంగా అమైనో ఆమ్లాలుగా విభజించడంలో సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

4. కివీ పండు నిద్రలేమిని పోగొడుతుంది. నిద్రపోవడానికి సహాయపడుతుంది. కివి పండులో సెరోటోనిన్ వంటి సమ్మేళనాలు ఉన్నందున రాత్రి నిద్రపోవడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కివీ వినియోగం నిద్ర భంగం నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.

5. కేన్సర్ కు కారణమయ్యే జన్యుపరమైన కారకాలను నివారిస్తుంది. కేన్సర్ రావటానికి కారణమయ్యే కారకాలతో పోరాడుతుంది.

6. కివీ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కొలెస్ట్రాల్ ను అదుపులో ఉండే లా చేస్తాయి. కంటి సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. చూపు మెరుగుపరుస్తుంది.రోజువారి డైట్ లో కివీని చేర్చుకుంటే చూపు మందగించే సమస్య నుంచి బయటపడతారు.

7. కివీ పండు గుజ్జును ఫేస్ మాస్క్ గా ఉపయోగించవచ్చు. కేశ సంరక్షణకు గుజ్జును షాంపులా వాడుకోవచ్చు. జుట్టు రాలటాన్ని అరికడుతుంది.

8. శరీరంలో ఉండే అనవసరపు టాక్సిన్లని అరికట్టేందుకు కివి పండు దోహదపడుతుంది

9.  మలబద్ధకం నుండి ఉపశమనం.. మలబద్ధకం, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ప్రతిరోజు కివీని తినడం మర్చిపోవద్దు. రోజుకు 2నుంచి 3 కివీస్ తింటే మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చని చెబుతున్నారు నిపుణులు.

10. కివిలో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఇ, పాలీఫెనాల్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే కివిలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు అమృతం లాంటిది. అంతే కాదు అనేక వ్యాధులను నివారించడంలో ఈ పండు సంజీవనిలా పనిచేస్తుంది.