నీళ్లు ఎక్కువ తాగినా, విటమిన్ ‘డి’ ఎక్కువ తీసుకున్నా ప్రమాదమే..

నీళ్లు ఎక్కువ తాగినా, విటమిన్ ‘డి’ ఎక్కువ తీసుకున్నా ప్రమాదమే..

నీరు ఎంత తాగితే అంత మంచిదని చాలామంది అంటుంటారు. అయితే అధికంగా నీరు తాగడం కూడా ప్రమాదమేనని ఎంతమందికి తెలుసు? మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం అవసరమైన అన్ని పోషకాల కలయికగా ఉండాలి. ఆ పోషకాలలో విటమిన్ డీ పాత్ర చాలా ముఖ్యమైనది. సూర్యరశ్మి వల్ల చర్మంలో ఉత్పత్తి అయ్యే విటమిన్ ఇది. ఫ్లూ, హృదయ సంబంధ వ్యాధులు, ఎముక సంబంధిత వంటి వ్యాధులను నివారించడానికి ఈ విటమిన్ ఎంతగానో సహాయపడుతుంది. అందుకే ఇది శరీరానికి చాలా ముఖ్యం. ఎముకల ధృఢత్వాన్ని పెంచడం విటమిన్ డీ యొక్క ముఖ్యమైన విధుల్లో ఒకటి. అంతేకాకుండా విటమిన్ డీ మనం తీసుకునే ఆహారం నుంచి కాల్షియాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ డీ తక్కువైతే అనారోగ్యం బారినపడే అవకాశాలు చాలా ఎక్కువ.

విటమిన్ డీ లోపం యొక్క కొన్ని సాధారణ లక్షణాలు:
అలసట మరియు నొప్పులు రావడం
కండరాల బలహీనత ఏర్పడటం
ఎముకలు పలుచబడి తొందరగా విరిగే అవకాశం

అధిక పోషకవిలువలు గల ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం కూడా శరీరానికి హాని చేస్తుంది. నీరు తాగితే ఆరోగ్యం బాగుంటుందనేది అందరికీ తెలిసిన విషయం. శరీరాన్ని హైడ్రేట్ చేసి ఆరోగ్యంగా ఉంచడంలో నీరు ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే నీటిని పరిమితికి మించి తాగితే మాత్రం హానికరమని చాలామందికి తెలియదు. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో సోడియం స్థాయి తగ్గుతుంది. ఇది హైపోనాట్రేమియాకు దారితీస్తుంది. ఈ వ్యాధి బారిన పడితే అలసట, వికారం కలుగుతాయి.

శరీరంలో విటమిన్ డీ ఎక్కువైతే ఎందుకు ప్రమాదకరం?
శరీరంలో విటమిన్ డీ ఎక్కువైతే శరీరం విషపూరితమయ్యే అవకాశముంది. విటమిన్ డీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలను పరిశీలిద్దాం.

రక్తంలో కాల్షియం యొక్క స్థాయి పెరగడం: రక్తంలో కాల్షియం లెవల్స్ పెరగడం వల్ల వచ్చే వ్యాధిని హైపర్ కాల్సిమియా అంటారు. ఇది విటమిన్ డీ అధికంగా తీసుకోవడం వల్ల వస్తుంది. దీని వల్ల మనిషిలో అలసట, వికారం, మైకం, జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, దాహం పెరగడం, వాంతులు మరియు అధిక మూత్రవిసర్జన వంటివి కనిపిస్తాయి. అంతేకాకుండా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి కూడా కారణమవుతుంది.

కిడ్నీ సమస్యలు: విటమిన్ ఢీ అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు పాడయ్యే అవకాశముంది. మూత్రపిండాల సమస్య ఉన్నవారి మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

జీర్ణ సమస్యలు: అధిక ఢీ విటమిన్ వల్ల విరేచనాలు, మలబద్దకం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

ఎముక సమస్యలు: ఎముకల ఆరోగ్యం కాపాడుకోవడంలో విటమిన్ డీ ముఖ్యం. అయితే అధికంగా విటమిన్ డీ తీసుకోవడం వల్ల కూడా ఎముకలకు హాని కలుగుతుంది. శరీరంలో విటమిన్ డీ స్థాయిలు పెరగడం వల్ల విటమిన్ కే2 స్థాయిలు ప్రభావితమవుతాయి. ఇది ఎముకల క్షీణతకు మరింత దారితీస్తుంది.

ఇతర ఆరోగ్య సమస్యలు: ఆకలి తగ్గడం, వికారం, అలసట మరియు వాంతులు కలుగుతాయి. శరీరంలో కాల్షియం లెవల్స్ పెరగడం వల్ల ఇవన్నీ వచ్చే అవకాశముంది.

For More News..

దారుణం.. 6 ఏళ్ల బాలికను రేప్ చేసి.. లంగ్స్ బయటకు తీసి..

యాడ్స్ కోసం రూ. 300 కోట్లు ఖర్చు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం

సోన్‌సూద్‌కు అరుదైన గౌరవం అందించిన ఆయన సొంతరాష్ట్రం