కరోనాపై  పోరుకు మరింత డబ్బు ఖర్చు చేయాలి:IMF

కరోనాపై  పోరుకు మరింత డబ్బు ఖర్చు చేయాలి:IMF

కరోనా వైరస్‌ వల్ల గ్లోబల్‌ మార్కెట్లు ఇది వరకే ఎన్నడూ లేనన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని, మున్ముందు ఇంకా సవాళ్లు ఎదురవుతాయని ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌‌ (ఐఎంఎఫ్‌) స్పష్టం చేసింది. కరోనా కేసులతో పాటు ఆర్థిక సమస్యలు పెరుగుతాయని అంచనా వేసింది. 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం కంటే ప్రస్తుత క్రైసిస్‌ మరింత బలంగా ఉందని చెప్పింది. ఇంతటి దారుణ పరిస్థితులను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్ట లినా జార్జివా అన్నారు. ‘‘గ్లోబల్‌ ఎకానమీ పూర్తిగా ఆగిపోవడం ఐఎంఎఫ్‌ చరిత్రలోనే లేదు. ఇంతటి ఆపద నుంచి బయటపడాలంటే అందరం పరస్పరం సహకరించుకోవాలి. ఇది వరకే 90 దేశాలు ఎమర్జెన్సీ ఫైనాన్సింగ్‌ కోసం మమ్మల్ని అడిగాయి. అన్ని దేశాలూ తమ ఆరోగ్య సంరక్షణ రంగంపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. నిరుపేద దేశాలను ఆదుకోవడానికి ఇది వరకే మేం 90 బిలియన్‌ డాలర్ల ఆర్థఇక అందించాం’’ అని ఆమె వివరించారు. ఇదిలా ఉంటే వివిధ  ఆర్థిక సంస్థలు, రేటింగ్‌ ఏజెన్సీలు ఇండియా ఎకానమీ బాగా దెబ్బతింటుందని హెచ్చరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఏకంగా 30 ఏళ కనిష్టానికి పడిపోవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ అంచనా వేసింది. 2020–21లో వృద్ధి రేటు కేవలం మూడు శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. మూడీస్‌, కేపీఎంజీ వంటి సంస్థలు కూడా జీడీపీ గ్రోత్‌ రేటు మూడు శాతం లోపే ఉం డొచ్చని స్పష్టం చేశాయి.

 రెండూ ముఖ్యమే…

‘‘కరోనాతో పోరాటం కోసం అన్ని దేశాలూ తమ ప్రజలను ఇండ్ల కే పరిమితం చేయాల్సివస్తోంది. ఎకానమీ పూర్తిగా నిలిచిపోయింది. ఉద్యోగాల ను కాపాడుకోవడం కంటే ప్రాణాలు కాపాడు కోవడం ముఖ్యం ’’ అని జార్జివా, టెడ్రెర్జిస్ బ్రిటిష్‌ న్యూస్‌పేపర్‌ ది డెయిలీగ్రాఫ్‌లో రాశారు. ప్రపంచ ఆరోగ్య సంక్షోభం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ.. రెండూ విడదీయరానివని, కరోనాపై పోరాడితేనే ఎకాన మీలు గాడినపడతాయని జార్జివా రాశారు. ఎదుగుతున్న ఎకానమీలకు చాలా సమస్యలు వస్తాయన్నారు.

ఉద్యోగాల కంటే ప్రాణాలుముఖ్యం…

ఆర్ధిక మాంద్యంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం కరోనా రోగుల ప్రాణాలను రక్షించడం అన్నిం టికంటే ముఖ్యమని ఐఎంఎఫ్‌, డబ్ల్యూ హెచ్‌ఓ ప్రకటించాయి. ప్రపంచం ఎన్నడూ చూడని కష్టకాలంలో మనం ఇప్పుడు ఉన్నామని, మానవజాతికే ఇది చీకటి కాలమని పేర్కొన్నాయి. ఎకానమీలు పుంజుకోవాలంటే కరోనాను కట్టడి చేయాలని ఐఎంఎఫ్‌ ఎండీ జార్జివా, డబ్ల్యూ హెచ్‌ఓ డైరక్టర్ జనరల్‌ టెడ్రోస్‌ అదానోమ్‌ స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సమతూకాన్ని కొనసాగించడం కష్టమే అయినా ప్రాణాల రక్షణ ముఖ్యమని అన్నారు. ప్రపంచంలోని సగం జనాభా ఇప్పుడు లాక్‌డౌ న్‌లో ఉన్నారు. ఈ మహమ్మారి ఇప్పటికే 50 వేల మందిని బలిగొంది.