ఈపీఎఫ్ఓలో కొత్తగా 20 లక్షలకు పైగా ఉద్యోగులు చేరిక

ఈపీఎఫ్ఓలో కొత్తగా 20 లక్షలకు పైగా ఉద్యోగులు చేరిక

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్​ ప్రావిడెంట్​ఫండ్​ఆర్గనైజేషన్​(ఈపీఎఫ్​ఓ) ఈ ఏడాది మే నెలలో భారీ వృద్ధిని నమోదు చేసింది.  రికార్డు స్థాయిలో 20.06 లక్షల మంది కొత్త మెంబర్లు చేరారు. ఈ సంఖ్య ఈపీఎఫ్​ఓ చరిత్రలోనే ఒక నెలలో నమోదైన అత్యధిక నెట్ పేరోల్ అడిషన్.  కొత్తగా చేరిన వారిలో 9.42 లక్షల మంది మొదటిసారిగా ఈపీఎఫ్​ఓ పరిధిలోకి వచ్చినవారు. వీరిలో 18-–25 సంవత్సరాల మధ్య వయసు గల యువత సంఖ్య ఎక్కువగా ఉంది.  ఈ నెలలో చేరిన మొత్తం సభ్యులలో 14.37 లక్షల మంది పురుషులు కాగా, 5.69 లక్షల మంది మహిళలు ఉన్నారు. 16.11 లక్షల మంది గతంలో ఉద్యోగాలు వదిలి, తిరిగి ఈపీఎఫ్​ఓలో చేరారు.