గోల్డ్ ట్రేడింగ్ పేరుతో రూ. 23 లక్షలు కాజేసిన్రు

గోల్డ్ ట్రేడింగ్ పేరుతో  రూ. 23 లక్షలు కాజేసిన్రు

ఎల్బీనగర్, వెలుగు: గోల్డ్ ట్రేడింగ్ ​పేరుతో మహిళ నుంచి రూ.23.15 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ చంద్రపురి కాలనీలో నివాసం ఉండే రచన నల్గొండ జిల్లాలో హార్టికల్చర్ ఆఫీసర్​గా చేస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు ‘గోల్డ్ ట్రేడింగ్ 3038’ పేరుతో వాట్సప్​లో ఆమెను కాంటాక్ట్​ అయ్యారు. హెడ్​ఆఫీస్​ మలేషియాలో ఉందని నమ్మించారు. పీఓఎం గోల్డ్ యాప్ లింక్ ఆమెకు పంపించారు. అందులో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని, ముందుగా రూ . 5,000 డిపాజిట్ చేసి రిజిస్టర్ చేసుకోవాని సూచించారు. తర్వాత రూ. 5 లక్షలు డిపాజిట్ చేయడం ద్వారా వీఐపీ సభ్యత్వంలో చేరాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దాంతో రూ .5 లక్షలు చెల్లించింది. రెండు రోజుల తర్వాత మరో రూ.3 లక్షల స్కీమ్​లో చేరాలని చెప్పడంతో తన డబ్బులు వెనక్కు ఇవ్వాలని కోరింది. రూ .25 లక్షలు అయిన తర్వాత డబ్బులు విత్ డ్రా చేయగలరని చెప్పారు. 15 % పన్ను కింద రూ .3.75 లక్షలు, గుర్తింపు తనిఖీకి మరో రూ.5 లక్షలు.. ఇలా 23.5 లక్షలు వసూలు చేశారు. డబ్బులు విత్ డ్రా కాకపోవడం, ఎవరూ స్పందించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి రచన ​పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె డబ్బులు పంపించిన బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.