కడుపునొప్పి,వాంతులతో ఆస్పత్రిలో చేరిన 60 మంది విద్యార్థులు

కడుపునొప్పి,వాంతులతో ఆస్పత్రిలో చేరిన 60 మంది విద్యార్థులు

కర్ణాటకలో 60 మందికి పైగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. చిత్రదుర్గ జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్లో  మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు వచ్చాయి. దీంతో వెంటనే విద్యార్థులను దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విద్యార్థులు తిన్న భోజనాన్ని టెస్టింగ్ కు పంపించారు.ఈ స్కూల్లో దాదాపు 125 మందికి మధ్యాహ్నభోజనం అందిస్తున్నారు.

ఈ స్కూల్లో ఇలాంటి ఘటన జరగడం  రెండో సారి. గత జూలైలో మధ్యాహ్నం భోజనం తిని చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. విద్యార్థులకు స్కూల్లో బెడ్లు లేకపోవడంతో  చాలా మంది నేలపై పడుకుంటున్నారని గతంలో విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి