ఇక ఔటర్ పక్కన ఆగొచ్చు.. ఫుడ్ తిని వెళ్లొచ్చు!

ఇక ఔటర్ పక్కన ఆగొచ్చు.. ఫుడ్ తిని వెళ్లొచ్చు!
  • ఇంటర్ ఛేంజెస్ ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు, ఫుడ్ కోర్టులు,  సర్వీస్ సెంటర్లు
  • వే సైడ్ ఎమినిటీస్’ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టిన రాష్ట్ర సర్కార్ 
  • హెచ్ఎండీఏ అధికారులు నివేదికను అందించినట్టు సమాచారం
  • గత బీఆర్ఎస్ పాలనలో ముందుకు కదలని ప్రపోజల్స్  

హైదరాబాద్,వెలుగు : ఔటర్​రింగ్ ​రోడ్ తో హైదరాబాద్ సిటీ రూపురేఖలే మారాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించగా.. సిటీకి తలమానికంగానూ నిలిచింది. ఓఆర్ఆర్ పై ఒకసారి వాహనాలు ఎక్కితే.. మధ్యలో ఎక్కడైనా ఆగి టీ తాగాలన్నా.. ఫుడ్ తినాలన్నా ..సేదతీరాలన్నా ఆ చాన్సే లేదు. అయితే.. ఔటర్​పై ‘వే సైడ్​ఎమినిటీస్​‘పేరుతో ఒక ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ రూపొందించింది. ఇది అందుబాటులోకి వస్తే ఔటర్​ జర్నీ చేసే ప్రయాణికులకు ఎంతో అనువుగా ఉండడమే కాకుండా ఎక్కడైనా కొంత సేపు ఆగి సేదతీరొచ్చు. వీలేతై ఫుడ్ కూడా తిని వెళ్లొచ్చు.

ప్రాజెక్ట్ ఏర్పాటైతే  భూముల ధరలు కూడా పెరిగి ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అధికారులు భావించారు. ఇందుకు పబ్లిక్​అండ్​ప్రైవేట్​పార్ట్ నర్​షిప్​(పీపీపీ)పద్ధతిలో ప్రాజెక్ట్ ను చేపట్టాలని నిర్ణయించారు. అయితే.. గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు నివేదికను అధికారులు అందజేయగా ఎలాంటి ఫురోగతి కనిపించలేదు. 

పైలట్ ప్రాజెక్ట్ గా రెండ్లు చోట్ల  నిర్మించేందుకు..

ఓఆర్ఆర్153 కిలో మీటర్ల మేర ఉండగా.. దీని పొడవునా19 ప్రాంతాల్లో ఇంటర్​ఛేంజెస్​ఉంటాయి. ఒక్కసారి ఔటర్ పైకి వాహనం ఎక్కితే వేరే దారిలోకి మళ్లాలంటే ఇంటర్​ఛేంజెస్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే.. హెచ్ఎండీఏలోని హైదరాబాద్ ​గ్రోత్​కారిడార్ లిమిటెడ్(హెచ్ జీసీఎల్​) విభాగం అధికారులు ‘వే సైడ్​ఎమినిటీస్’​ ప్రాజెక్టులను ఇంటర్ ​ఛేంజెస్​ ప్రాంతాల వద్ద నిర్మించాలని నిర్ణయించారు.  

ఆదాయం పెంచుకునేందుకు..

ఫుడ్ కోర్టులు, వెహికల్​సర్వీస్​సెంటర్లు, బ్యాంకులు, పెట్రోల్​బంకులు, ఎంటర్​టైన్​మెంట్​సెంటర్లు ఉండేలా ప్రాజెక్ట్ కు రూపొందించారు. ఇందుకు పైలట్​ప్రాజెక్టుగా పెద్ద​అంబర్​పేట, బొంగుళూరు వద్ద నిర్మించేందుకు కాంట్రాక్టు సంస్థల నుంచి ఎక్స్​ప్రెషన్​ఆఫ్​ఇంట్రెస్ట్​కూడా ఆహ్వానించారు. ఔటర్ పై రాకపోకలు సాగించే వాహనాల కోసమే ప్రాజెక్టును ప్రతిపాదించారు. తద్వారా ఇంటర్​ఛేంజెస్​ప్రాంతాల వద్ద వ్యాపార లావాదేవీలు పెంచేందుకు ఆదాయం సమకూర్చుకోవడంతోపాటు ఎంతో మందికి వ్యాపార, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావించారు.

ప్రాజెక్టుపై గత ప్రభుత్వం మొదట్లో ఆసక్తి చూపించినా తర్వాత దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా కాంగ్రెస్​ప్రభుత్వం మళ్లీ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టినట్టు, దీనికి సంబంధించిన పూర్తి నివేదికను కూడా అధికారులు అందజేసినట్టు సమాచారం.  గ్రీన్​సిగ్నల్​వస్తే ​ఇంటర్​ ఛేంజెస్​వద్ద  దశలవారీగా నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. వీటి ఏర్పాటు ద్వారా స్థానికులకు కూడా ఉపాధి లభించే అవకాశం ఉంటుందని హెచ్ఎండీఏ ఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.