
హైదరాబాద్, వెలుగు : అల్కాహాల్ హాంగోవర్ నుంచి విముక్తి కల్పించే సహజ సిద్ధమైన డిటాక్స్ డ్రింక్ మార్నింగ్ ఫ్రెష్‌ను హెల్త్‌లైన్ సంస్థ బుధవారం హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేసింది. మల్బరీ ఆకులు, విటమిన్ సి వంటి సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేసే ఈ ఆయుర్వేద డ్రింక్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవని కంపెనీ ప్రకటించింది. మద్యం సేవించాక దీనిని తీసుకుంటే మరునాడు ఉదయం ఎలాంటి హాంగోవర్ ఉండదని తెలిపింది. లివర్‌లోని చెడుపదార్థాలను శుభ్రం చేయడం, అల్కాహాల్ త్వరగా జీర్ణమయ్యేలా చేయడం ద్వారా ఇది హాంగోవర్‌ను తొలగిస్తుందని తెలిపింది.
బెంగళూరు, చెన్నై, ముంబైలో విజయవంతమైన ఈ డ్రింక్ ఇక నుంచి హైదరాబాద్‌లోని బార్లు, సూపర్ మార్కెట్లలో అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఇది పుదీనా, స్ట్రాబెరీ, కోలా, దాల్చిన ఫ్లేవర్లలో లభ్యమవుతుంది. 60 మిల్లీలీటర్ల బాటిల్ ధర రూ.125 ఉంటుంది. ఈ సందర్భంగా హెల్త్‌లైన్ ఉన్నతాధికారి శ్రీవత్సన్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ నగరాల్లో ఈ డ్రింక్‌ను సరఫరా చేయడానికి బిగ్ బజార్, రత్నదీప్ వంటి రిటైలర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. బెంగళూరులోని ప్లాంటులో దీనిని తయారు చేస్తున్నామని చెప్పారు. ఉత్పత్తి మార్కెటింగ్ కోసం రూ.కోటి పెట్టుబడి పెట్టామని వెల్లడించారు.