అదో ‘సుపారీ మీడియా’

అదో ‘సుపారీ మీడియా’

న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ విషయంపై ప్రముఖ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ రాసిన వార్తా కథనం మీద కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్ ఫైర్ అయ్యారు. న్యూయార్క్ టైమ్స్ (ఎన్వైటీ) ఓ సుపారీ మీడియా అని సింగ్ ఆరోపించారు. అసలు ఎన్వైటీని ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. కాగా, గతేడాది మొత్తం దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్ ను 2017లో ఇజ్రాయెల్ నుంచి భారత్ కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతో పాటు ఈ డీల్ ను కూడా కుదుర్చుకుందని తెలిపింది. పెగాసస్ తయారీ సంస్థ ఎస్ఎస్వోతో తమకు ఎలాంటి లావాదేవీలు జరగలేదని కేంద్ర సర్కారు చెప్పిన నేపథ్యంలో తాజా కథనం సంచలనాత్మకంగా మారింది. 

మరిన్ని వార్తల  కోసం:

మోడీ సర్కార్ దేశద్రోహానికి పాల్పడింది

ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్

త్వరలోనే ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు