డబ్బుతోపాటు క్రియేటివిటీ, ఇన్నొవేషన్ ​జాబ్స్ పై ఉద్యోగుల ఆసక్తి

డబ్బుతోపాటు క్రియేటివిటీ, ఇన్నొవేషన్ ​జాబ్స్ పై ఉద్యోగుల ఆసక్తి

న్యూఢిల్లీ : మన దేశంలోని ఉద్యోగులలో  మూడో వంతు మంది జాబ్​ మారాలని కోరుకుంటున్నారట. కెరీర్​లో ముందుకెళ్లకుండా అడ్డంకులు ఎదురవుతున్నట్లు 71 శాతం మంది ఫీలవుతున్నారంట. పీడబ్ల్యూసీ ఇండియా రిలీజ్​ చేసిన తాజా రిపోర్టు ఈ విషయం వెల్లడించింది. గత రెండేళ్లలో దేశంలోని వర్క్​ప్లేస్​లలో చాలా మార్పులు వచ్చాయని, ఎంప్లాయర్లు, ఎంప్లాయీలు ఇద్దరిలోనూ ఈ మార్పులు కనిపిస్తున్నాయని రిపోర్టు తెలిపింది. నిపుణులైన ఉద్యోగులతో కంపెనీలను నింపుకోవాలని ఎంప్లాయర్లు చూస్తుంటే, మరోవైపు డబ్బుతోపాటు క్రియేటివిటీ, ఇన్నొవేషన్ ​ఉండే చోట్ల ఆపర్చునిటీస్​ కోసం ఉద్యోగులు ఉవ్విళ్లూరుతున్నారని పీడబ్ల్యూసీ రిపోర్టు పేర్కొంది. ఇండియా వర్క్​ఫోర్స్​ హోప్స్​ అండ్ ఫియర్స్​ సర్వే 2022 పేరిట ఈ రిపోర్టును విడుదల చేసింది. 

మిలినియల్సే ఎక్కువ....

గ్లోబల్​గా వర్క్​ఫోర్స్​పై  చేసిన సర్వే నుంచే ఇండియా రిపోర్టును పీడబ్ల్యూసీ తయారు చేసింది. ఈ సర్వేలో మన దేశం నుంచి 2,608 మంది పాల్గొన్నట్లు పీడబ్ల్యూసీ తెలిపింది. వారిలో 93 శాతం మంది ఫుల్​టైమ్​ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లేనని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం ఇండియాలోని ఉద్యోగులలో మూడొంతుల మంది (34 శాతం) ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలకు గుడ్​బై చెప్పాలనుకుంటున్నారు. గ్లోబల్​గా చూస్తే ఇలా కొత్త కంపెనీలో చేరాలనుకుంటున్న వారు 19 శాతం మందే ఉన్నారని రిపోర్టు వెల్లడించింది. ఉద్యోగాలు మానేయాలనుకుంటున్నట్లు 32 శాతం మంది చెప్పినట్లు సర్వే రిపోర్టు తెలిపింది. ముఖ్యంగా మిలినియల్స్​లో కొత్త ఉద్యోగాలు కావాలనుకుంటున్న వారే ఎక్కువ మంది ఉన్నట్లు పేర్కొంది. వారిలో 37 శాతం మంది రాబోయే ఏడాది కాలంలో  కొత్త కంపెనీలను వెతుక్కోవాలనుకుంటున్నట్లు వివరించింది. కానీ, జెనరేషన్​ జెడ్​ ఉద్యోగులు మాత్రం తమ ఉద్యోగాలను అంటి పెట్టుకుని ఉండాలనుకుంటున్నట్లు పీడబ్ల్యూసీ సర్వే తేల్చింది. అయితే వారిలో మూడో వంతు మంది తమ పని గంటలను తగ్గించమని ఎంప్లాయర్లను కోరాలనుకుంటున్నట్లు పేర్కొంది. 

ఆయా దేశాలలోని సోషల్​, ఎన్విరాన్​మెంటల్​, ఎకనమిక్​, జియో పొలిటికల్​ మార్పులు అక్కడి సంస్థల వర్క్​ఫోర్స్​ స్ట్రేటజీపై ఎఫెక్ట్​ చూపిస్తాయని పీడబ్ల్యూసీ పార్ట్​నర్​ చైతాలి ముఖర్జీ చెప్పారు. ఆర్గనైజేషన్​ అవసరాల కోసం షార్ట్​ టర్మ్​, లాంగ్​ టర్మ్​ ప్లాన్​లు వేసుకునేటప్పుడు పై అంశాలను లీడర్లు దృష్టిలో పెట్టుకోవల్సి ఉంటుందన్నారు. భవిష్యత్తు కోసం ప్రిపేర్​ అవడానికి ఉద్యోగుల ఆలోచనలతో సమానమైన ఆలోచనలు చేయడం ఎంప్లాయర్లకు తప్పనిసరని ముఖర్జీ చెప్పారు. కొలీగ్స్​ నుంచి టెక్నాలజీ స్కిల్స్​ పెంపొందించుకునే ఛాన్స్​ లేదని సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతం మంది భావిస్తున్నట్లు పీడబ్ల్యూసీ రిపోర్టు వెల్లడించింది. వర్క్​లో సరయిన అవకాశాలు రావడం లేదనీ ఆ సగం మంది ఫీలవుతున్నట్లు పేర్కొంది. ఈ లెర్నింగ్​ గ్యాప్​ టాప్​ లెవెల్లోనే మొదలవుతోందని, సీఈఓలలో 50 % మంది టెక్నాలజీ స్కిల్స్​ నేర్చుకునే ఛాన్స్​ ఉండటం లేదని చెబుతున్నట్లు రిపోర్టు వివరించింది.