ఆదివాసీల దండారీ సంబురం

ఆదివాసీల దండారీ సంబురం
  • ఆదివాసీలది ప్రకృతితో మమేకమైన జీవితం

నేరడిగొండ/ వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్/ ఇంద్రవెల్లి/గుడిహత్నూర్, వెలుగు : ఆదివాసీలది ప్రకృతితో మమేకమైన జీవితమని కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్ చార్జి ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండలంలోని రేంగన్ వాడి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన దండారీ ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. గ్రామస్తులు గుస్సాడీ నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం దండారీ నిర్వాహకులతో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భంగా గజేందర్​మాట్లాడుతూ.. ఆదివాసీలు ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారని, ఒకరినొకరు సహాయం చేసుకోవడం వారి నైజమన్నారు. ఆదివాసీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ఎవరికి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆదివాసీ పటేళ్లు దేవరీ, మహాజన్, నాయకులు 
పాల్గొన్నారు .

మామిడిగూడ గ్రామంలో...

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మామిడిగూడ గ్రామంలో దండారీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మత్తడిగూడ దండారీ బృందం గుస్సాడీ ఆడుతూ సందడి చేసింది. మహిళలు రేల పాటలకు అనుగుణంగా చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి

ఆదివాసీ సంస్కృతిని భావితరాలకు అందించాలి

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. గుడిహత్నూర్‌ మండలంలోని మాన్కాపూర్‌లో శుక్రవారం నిర్వహించిన దండారీ ఉత్సవాలకు ఆయన ఊట్నూర్‌ ఏఎస్పీ కాజల్‌తో కలిసి హాజరయ్యారు. దండారీలో ఆదివాసీలు పాటించే పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. గ్రామ పటేళ్ల ఆధ్వర్యంలో పండుగ నిర్వహించడం, ఒక గ్రామానికి మరో గ్రామం ఆతిథ్యం ఇవ్వడమంటే ఒకరికొకరు ప్రేమను పంచుకోవడమేనని పేర్కొన్నారు. అంతకుముందు గ్రామస్తులు వారికి సంప్రదాయ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఎస్పీ, ఏఎప్సీ కోలాటం ఆడుతూ, రేల పాటలకు మహిళలలో కలిసి నృత్యం చేశారు. సీఐ రాజు, ఎస్సై శ్రీకాంత్‌ తదితరులున్నారు.

ఇంద్రవెల్లి మండలం గౌరపూర్ లో

 ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గౌరపూర్ లో శుక్రవారం నిర్వహించిన దండారీ ఉత్సవాలకు ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్ సింగ్ హాజరయ్యారు. ఆదివాసీలతో కలిసి ఎస్పీ చచ్చోయ్ ఆట ఆడారు. ఆదివాసీ యువత విద్యపై దృష్టి సారించాలన్నారు. సీఐ ప్రసాద్, ఎస్సై సాయన్న, గ్రామస్తులు పాల్గొన్నారు. -