
వాషింగ్టన్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తో మరో 2 వారాల్లో సమావేశం అవుతానని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. శుక్రవారం ఆయన ఫాక్స్ బిజినెస్ నెట్‌వర్క్ ఛానల్ తో మాట్లాడారు.
"ప్రస్తుతం అమెరికాతో చైనా సంబంధాలు బాగానే ఉన్నాయి. మరో రెండు వారాల్లో జిన్‌పింగ్‌ను కలుస్తాను. ఇటీవల చైనాపై విధించిన100% టారిఫ్‌లు తాత్కాలికమే. అవి శాశ్వతంగా ఉండవు. చైనా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకే అలా చేశాను.
జిన్‌పింగ్‌తో సమావేశం తర్వాత చైనాతో పరిస్థితులు మెరుగుపడతాయని నమ్ముతున్నాను" అని పేర్కొన్నారు. దక్షిణ కొరియాలో ఈ నెల 31 నుంచి నవంబర్ 1 వరకు ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (అపెక్) సమిట్ జరగనుంది. మరో రెండు వారాల్లో జరగనున్న ఈ ఈవెంట్ లోనే ట్రంప్, జిన్‌పింగ్ లు భేటీ కానున్నారు.