అప్పుడు మర్కజ్ ఇప్పుడు హైదరాబాద్

అప్పుడు మర్కజ్ ఇప్పుడు హైదరాబాద్
  • వివిధ రకాల అనారోగ్యాలతో హాస్పిటల్స్‌కు వస్తు న్న రోగులు
  • ఇన్‌ పేషెంట్లుగాఉన్న వారికి అంటుకుంటున్న కరోనా
  •  నాలుగు రోజుల్లోనే 15 కేసులు నమోదు
  •  పాజిటివ్ కేసుల ప్రైమరీ కాంటాక్ట్స్‌ కు టెస్టులు చేస్తున్న వైద్య సిబ్బంది
  •  నల్గొండలో 8 రోజుల్లో 360 మంది నుంచి శాంపిళ్ల సేకరణ

నల్గొండ జిల్లాలో గతంలో మర్కజ్‌, వలస కార్మికుల కారణంగా కరోనా కేసులు బయటపడగా, తాజాగా హైదరాబాద్ లింక్‌ ఉన్న కేసులే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. జిల్లాలో 22వ తేదీ నుంచి 26 వరకు 16 కేసులు పాజిటివ్‌ గా తేలగా, ఇందులో 15 కేసులు హైదరాబాద్‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లింక్‌ ఉన్నవే. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు టెస్టులు, ట్రీట్‌మెంట్‌ కోసం సిటీలోని పలు హాస్పి టల్స్ కు వెళ్తున్నారు. అక్కడ ఇన్‌ పేషెంట్లుగా చేరిన వీరికి వైరస్‌ సోకుతోంది. వీరితో కాంటాక్ట్ అయిన ఫ్యామిలీ మెంబర్స్‌కూ కరోనా సింప్టమ్స్‌ బయటపడు తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 45 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మే నెలలో 23 కేసులు నమోదు కాగా, ఈ ఒక్క నెలలోనే 22 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇద్దరు వలస కార్మికులు కాగా, మరో ముగ్గురికి ప్రైమరీ కాంటాక్ట్స్‌ నుంచి వచ్చింది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న మరొ కరికి ఎవరితో కాంటాక్ట్ లేకుండానే కరోనా సోకింది. మిగతా 16 మందికి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లింక్‌ ఉన్న వాళ్లే కావడం గమనార్హం.

18 యాక్టివ్ కేసులు

జిల్లాలో ఇప్పటి వరకు 45 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇందులో 26 మంది డిశ్చార్జి కాగా, కట్టంగూరు మండలం అయిటి పాములకు చెందిన ఒకరు చనిపోయారు. ప్రస్తుతం 18 కేసులు యాక్టివ్‌గా ఉన్నా యి. ఇందులో ప్రభుత్వ హాస్పిట ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఐసోలేషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నలుగురు చికిత్స పొందుతుండగా, మిగిలిన 14 మంది హైదరాబా ద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హాస్పిటల్స్‌తో పాటు, హోం ఐసోలేషన్‌లో ఉండి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. వ్యాధి సోకిన ప్రాంతాల్లో60 మంది హోంక్వా రంటైన్‌లో ఉన్నా రు.

 8 రోజుల్లో 360 మందికి టెస్టులు

నల్గొండ జిల్లాలో కరోనా టెస్టుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత కొద్దిరోజులుగా జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడంతో అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. గడిచిన నాలుగు రోజుల వ్యవధిలోనే జిల్లాలో కొత్తగా 16 మందికి పాజిటివ్‌ గా తేలడంతో వారితో ప్రైమరీ కాంటాక్ట్స్‌ అయిన ప్యామిలీ మెంబర్స్‌ నుంచి శాంపిళ్లను తీసుకున్నారు. నల్గొండ జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతి రోజు కనీసం 50 మందికి తగ్గకుండా కరోనా టెస్టులు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ప్రైవేట్‌ ల్యాబ్స్ లో సైతం టెస్టులు చేసేందుకు అనుమతిచ్చింది. దీంతో ఈ నెల 18 తేదీ నుంచి 26 వరకు జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 360 మందికి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేశారు. ఈ నెల 22 నుంచి 25 వరకు రోజుకు నాలుగు చొప్పున కరోనా కేసులు నమోదు కావడంతో అలర్ట్ అయిన వైద్య‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ ఆఫీసర్లు ప్రైమరీ కాంటాక్ట్స్ అందరికీ టెస్టులు చేస్తున్నారు.

ప్రైవేటు టెస్టుల్లో గందరగోళం

ప్రైవేట్‌ ల్యాబ్స్ లోనూ టెస్టుల సంఖ్య పెరుగుతోంది. కరోనా సింప్టమ్స్‌ ఉన్న వాళ్లు అందుబాటులో ఉన్న ప్రైవేట్‌ ల్యాబ్స్ లో టెస్టులు చేయించుకుంటున్నారు. ఎవరికైనా కరోనా పాజిటివ్‌గా తేలితే ఆ విషయాన్ని ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులు ముందుగా వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌లో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి . కానీ వాళ్లు పేషెం ట్లకు సమాచారం ఇస్తున్నారు. వీరితో పాటు సమీపంలోని పీహెచ్‌సీ సిబ్బందికి చెప్పినప్పటికీ ఆఫీషియల్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌లో నమోదు చేయకపో వడంతో కరోనా కేసులను జిల్లావైద్యాధికారులు కన్ఫర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం లేదు. గురువారం నకిరేకల్, నల్గొండలో నమోదైన రెండు కేసుల వివరాలు అధికారికంగా మెడికలో రికార్డుల్లోకి ఎక్కలేదు. శుక్రవారం చింతపల్లి మండలంలో కరోనా వ్యాధితో వృద్ధురాలు మృతి చెందింది. ఆమెకు కరోనా వచ్చిన విషయం కానీ, చనిపోయిన సమాచారం కానీ అధికారికంగా నమోదు కాలేదు. ప్రైవేట్‌ ల్యాబ్స్ లో టెస్ట్ చేయించుకోవడం ద్వారా ఆమెకు కరోనా అని నిర్ధారణ అయింది. కానీ ఆ సమాచారాన్ని వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌లో నమోదు చేయకపోవడం వల్ల శుక్రవారం మృతి చెందిన విషయాన్ని హెల్త్ బులెటిన్ లో ప్రకటించలేదు.

లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్న రిపోర్టులు

ప్రైమరీ కాంటాక్ట్స్ తో పాటు, కరోనా డ్యూటీలో పాల్గొంటున్న పోలీసులు, జర్నలిస్టులు, ఇతర అధికారులకు టెస్టులు చేస్తున్నారు. కానీ మెడికల్ రిపోర్టులు మాత్రం ఆలస్యం అవుతున్నాయి. ఇప్పటి వరకు ఇంకా 209 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టెస్టులు చేస్తున్నా ల్యాబ్‌లు చిన్నగా ఉండడంతో రిపోర్టులు ఆలస్యం అవుతున్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు. రోజుకు 200లకు మెడికల్ టెస్టులు చేయడం సాధ్యం కాదని అంటున్నారు.