
నాగర్‌కర్నూల్ టౌన్, వెలుగు : తెగిన వైరును సరిచేస్తుండగా ఓ బాలుడికి విద్యుత్ షాక్ కొట్టింది. గమనించిన అతడి తల్లి కాపాడేందుకు ప్రయత్నించగా ఆమె కూడా చనిపోయింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం తుమ్మలసుగూరు గ్రామంలో గురువారం జరిగింది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మలసుగూరు గ్రామానికి చెందిన జయమ్మ (39) పిండి గిర్నీ నడుపుతూ జీవిస్తోంది. గురువారం పిండి గిర్నికి విద్యుత్ సప్లై అయ్యే వైరు తెగడంతో ఆమె కొడుకు శ్రీకాంత్ (15) సరి చేసేందుకు ప్రయత్నిస్తుండగా షాక్ కొట్టింది. గమనించిన జయమ్మ కొడుకును కాపాడే ప్రయత్నం చేయగా ఆమెకు కూడా షాక్ కొట్టింది. ఇద్దరినీ స్థానికులు 108లో నాగర్ కర్నూల్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు ఇద్దరూ అప్పటికే చనిపోయారని నిర్ధారించారు.