
ఝరాసంగం, వెలుగు: వంట గ్యాస్ లీక్ అయ్యి మంటలు అంటుకుని ఒకే కుటుంబానికి చెందిన తల్లీ కొడుకులకు తీవ్ర గాయాలైన ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని ఏడాకులపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన గొర్రెకంటి శంకరమ్మ ఉదయం తన ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించాయి. వెంటనే నీళ్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది.
గమనించిన ఆమె కుమారులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా కుదరక పోవడంతో తీవ్ర గాయాలతో వంట గది నుంచి బయటకు వచ్చారు. స్థానికులు గమనించి 108 కు ఫోన్ చేసి వారిని అంబులెన్స్‌లో జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆస్పత్రికి వెళ్లి గాయపడిన బాధితులను పరమర్శించారు. మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షుడువెంకటేశం, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ప్రభు ఉన్నారు.