
జీడిమెట్ల, వెలుగు: ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం లక్ష్మీనగర్కాలనీకి చెందిన సురేశ్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఉమాదేవితో 19 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఒక కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.
సురేశ్ శనివారం డ్యూటీకి వెళ్లిన సమమంలో భార్య ఉమాదేవి ఇంట్లో ఉన్న కుమారుడు, కాలేజీలో ఉన్న కుమార్తెను తీసుకుని ఇంటినుంచి వెళ్లిపోయింది. ఫోన్ఇంట్లోనే పెట్టిపోవడంతో చుట్టుపక్కల ప్రదేశాలు, బంధువుల ఇండ్లలో చూసినా ప్రయోజనం లేకపోయింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.