కోతుల బెడదతో స్కూల్​ బంద్

కోతుల బెడదతో స్కూల్​ బంద్

మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం చండి గ్రామంలోని జడ్పీ హైస్కూల్​ఆవరణలో సోమవారం ఉదయం ఓ తల్లి కోతి చనిపోగా పిల్ల కోతి అరుపులకు వందల సంఖ్యలో కోతులు అక్కడికి వచ్చాయి. అవి కేకలు వేస్తూ దాడికి ప్రయత్నించడంతో స్కూల్​కు వస్తున్న స్టూడెంట్స్​భయంతో పరుగులు తీశారు.  విషయం తెలిసి కొందరు పేరెంట్స్​కోతులను తరిమేందుకు ప్రయత్నంచగా వారిపై కూడా దాడి చేయడానికి వచ్చాయి. సమాచారం తెలుసుకున్న ఎంఈవో బుచ్చా నాయక్  గ్రామస్తుల సహకారంతో కోతుల గుంపును వెళ్లగొట్టి చనిపోయిన కోతిని స్కూల్​ఆవరణలో నుంచి తీసివేయించారు. ‌‌‌‌‌‌‌‌ - శివ్వంపేట, వెలుగు